Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదిరిపోయే ఫీచర్లతో రెడ్మీ వై2... ధర ఎంతంటే...

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన తాజా మోడల్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్మీ వై2 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఎలెగెంట్ గోల్డ్‌, రోజ్ గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో, 3 లేదా 4 జీబీ ర్యామ్

Advertiesment
అదిరిపోయే ఫీచర్లతో రెడ్మీ వై2... ధర ఎంతంటే...
, గురువారం, 7 జూన్ 2018 (17:28 IST)
చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన తాజా మోడల్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్మీ వై2 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఎలెగెంట్ గోల్డ్‌, రోజ్ గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో, 3 లేదా 4 జీబీ ర్యామ్ వేరియెంట్ల‌లో ఈ ఫోన్‌ను తయారు చేసింది.
 
ఈ ఫోన్‌లో 5.99 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాల‌ను అమ‌ర్చారు. ముందుభాగంలో 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయ‌గా దీనికి ఫ్లాష్, ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్ర‌త్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ ఫోన్‌పై ఎయిర్‌టెల్ రూ.1800 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న‌ది. అలాగే, 240 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా అందివ్వనుంది. ఇకపోతే, ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఫోన్‌ను కొంటే మ‌రో రూ.500 అద‌న‌పు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ధరను రూ.9,999, రూ.12,999గా నిర్ణయించారు. ఈ ధరలకు అమెజాన్ సైట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. 
 
రెడ్మీ వై2 ఫీచ‌ర్లు...
5.99 అంగుళాల డిస్‌ప్లే, 1440×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

75 అంతస్తులను ఎక్కేసిన ఫ్రెంచ్ 'స్పైడర్‌మెన్'... చివరికి ఏమయ్యాడో తెలుసా?