Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

75 అంతస్తులను ఎక్కేసిన ఫ్రెంచ్ 'స్పైడర్‌మెన్'... చివరికి ఏమయ్యాడో తెలుసా?

ఫ్రెంచ్ స్పైడర్‌మెన్‌గా పేరొందిన అలైన్ రాబర్ట్ (55 ఏళ్లు) బుధవారం నాడు సియోల్‌లోని లోట్టే వరల్డ్ టవర్‌ని ఎలాంటి తాళ్లుగానీ, ముందస్తు జాగ్రత్తలుగానీ, అనుమతులు తీసుకోకుండా 123 అంతస్థులు గల భవనంలో 75 అంతస్థులను ఎక్కాడు. అయితే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి

75 అంతస్తులను ఎక్కేసిన ఫ్రెంచ్ 'స్పైడర్‌మెన్'... చివరికి ఏమయ్యాడో తెలుసా?
, గురువారం, 7 జూన్ 2018 (17:17 IST)
ఫ్రెంచ్ స్పైడర్‌మెన్‌గా పేరొందిన అలైన్ రాబర్ట్ (55 ఏళ్లు) బుధవారం నాడు సియోల్‌లోని లోట్టే వరల్డ్ టవర్‌ని ఎలాంటి తాళ్లుగానీ, ముందస్తు జాగ్రత్తలుగానీ, అనుమతులు తీసుకోకుండా 123 అంతస్థులు గల భవనంలో 75 అంతస్థులను ఎక్కాడు. అయితే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. 
 
14 ఫైర్ ట్రక్కులు మరియు 65 ఫైరింజన్‌లను ఘటనాస్థలిలో ఉంచారు. పోలీసులు ఎంతో కష్టపడి అతడిని అరెస్ట్ చేసారు. ఆ సందర్భంగా అతడు ఇలా చేయడం తనకు పెద్ద కష్టమేమీ కాదని, తాను దక్షిణ కొరియా ప్రజలను చాలా ఇష్టపడుతున్నానని, అంతేకాకుండా దక్షణకొరియా అద్భుతమైన దేశం అని పేర్కొన్నాడు. 
 
రెండు కొరియా దేశాల మధ్య శాంతి నెలకొనడానికి తాను ఇలా చేసానని చెప్పుకొచ్చాడు. రాబర్ట్ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బిల్డింగ్‌‌లు అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, పారిస్‌లోని ఈఫిల్ టవర్, అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా వంటి కట్టడాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎక్కేసి చరిత్ర సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణబ్ దాదా అంతపని చేస్తారని అనుకోలేదు : అహ్మద్ పటేల్