Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైరల్ అవుతున్న అంకుల్‌ డ్యాన్స్‌.. ప్రియా ప్రకాష్ వారియర్‌లా?

సోషల్ మీడియాలో అంకుల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయిపోతోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఆయన డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన సంజీవ్ శ్రీవాత్సవ్ మధ్యప్రదేశ్‌లోని భూపా

వైరల్ అవుతున్న అంకుల్‌ డ్యాన్స్‌.. ప్రియా ప్రకాష్ వారియర్‌లా?
, మంగళవారం, 5 జూన్ 2018 (15:09 IST)
సోషల్ మీడియాలో అంకుల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయిపోతోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఆయన డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన సంజీవ్ శ్రీవాత్సవ్ మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌కు చెందిన వ్యక్తి. వృత్తిపరంగా ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ ప్రొఫెసర్ అంకుల్ డ్యాన్స్‌కు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, బాలీవుడ్‌ నటుడు గోవిందా స్పందించాడు. 
 
తన సినిమాలోని ఓ పాటకు సంజీవ్‌ శ్రీవాత్సవ చేసిన డ్యాన్స్‌ వీడియో విపరీతంగా వైరల్ అవుతుండటం హ్యాపీ అన్నారు. వేదికపై శ్రీవాత్సవతో పాటు ఆయన భార్య కూడా కాలు కదపడం చాలా బాగుందని ప్రశంసించారు. 
 
ఏదో డాన్స్‌ చేస్తున్నట్లు కాకుండా ఆయన పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారని, ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని గోవిందా చెప్పారు. శ్రీవాత్సవ ఎప్పుడూ హ్యాపీగా వుండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ వీడియోను తాను మాత్రమే కాదని, తన భార్య కూడా చూసిందని తెలిపారు. ఫ్రొఫెసర్ డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు.
 
ఇక ''అంకుల్ డ్యాన్స్'' పేరిట బాగా పాపులర్ అయిన శ్రీవాత్సవ.. యూత్‌లో ఉన్నప్పుడే మంచి డ్యాన్సర్ అట. పలు ఫంక్షన్స్‌లో తాను డ్యాన్స్ చేసే వాడినని, ఇప్పుడు కూడా తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తాను యూత్‌లో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్‌గా ఉండే వాళ్ళమని.. ఇంకా అలానే వున్నామని సంజీవ్ శ్రీవాత్సవ్ అన్నారు. 
 
మే 12న ఈ వీడియోను షూట్ చేశారని చెప్పిన సంజీవ్, తనకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదన్నారు. తన భార్య అంజలితో కలసి స్టేజ్ పై డ్యాన్స్ చేశానని తెలిపారు. అంతేగాకుండా తన డ్యాన్స్‌కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిదా అవడాన్ని తాను జీవితంలో మరువలేనని.. ట్విట్టర్లో తన నృత్యాన్ని చూసిన ఆయన.. మధ్యప్రదేశ్ నీటిలోనే ఏదో ప్రత్యేక వుందని వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేశారు.
 
గత రెండు రోజులుగా తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని, గంట వ్యవధిలో తాను 100 కాల్స్ మాట్లాడాల్సి వచ్చిందని, మీడియా తన ఇంటర్వ్యూలు, ఫొటోల కోసం వస్తోందని, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సైతం ఫోన్ చేసి అభినందించారన్నారు. 
 
కాగా.. అంకుల్ డ్యాన్స్‌తో.. ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్‌లా శ్రీవాత్సవ సెలెబ్రిటీగా మారిపోయారు. ఇప్పటికే సునీల్ శెట్టిని శ్రీవాత్సవ కలిశారు. అంకుల్ డ్యాన్స్‌తో శ్రీవాత్సవకు సినీ ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులు హాయిగా ఫ్యాన్ కింద సేదతీరుతూ.. టీవీ సీరియల్స్ చూస్తున్నారు: నారా లోకేష్