Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులు హాయిగా ఫ్యాన్ కింద సేదతీరుతూ.. టీవీ సీరియల్స్ చూస్తున్నారు: నారా లోకేష్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కుట్రలను ప్రజలే తిప్పి కొడతారని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యాత్రల పేరిట అనవసర ఆరోపణలు చేస్తూ.. సర్కారుపై బురదజల్లుతున్నారన

Advertiesment
రైతులు హాయిగా ఫ్యాన్ కింద సేదతీరుతూ.. టీవీ సీరియల్స్ చూస్తున్నారు: నారా లోకేష్
, మంగళవారం, 5 జూన్ 2018 (14:52 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కుట్రలను ప్రజలే తిప్పి కొడతారని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యాత్రల పేరిట అనవసర ఆరోపణలు చేస్తూ.. సర్కారుపై బురదజల్లుతున్నారని నారా లోకేశ్ విమర్శించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు లేవన్నారు. పొలం పనులు పూర్తి చేసుకుని రైతులు హాయిగా ఫ్యానుల కింద సేదతీరుతున్నారని.. కరెంట్ ఎప్పుడు పోతుందోననే టెన్షన్ వారికి లేదన్నారు. ఇక రాత్రిపూట కరెంట్ కోత టెన్షన్ లేకుండా సీరియళ్లు చూస్తున్నారని చెప్పారు. 
 
గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన లోకేశ్‌ అనంతరం మాట్లాడుతూ.. రాబోయే 30 రోజుల్లో నిరుద్యోగులకు రూ.1000 చొప్పున భృతి ఇస్తున్నామని అన్నారు. అంతేగాక చంద్రన్న బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 
 
మరోవైపు ట్విట్టర్‌లోనూ ఏపీ మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. విపక్షాల విమర్శలకు ట్వీట్ల ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో క్రైమ్ పెరిగిపోయిందన్న వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డ నారా లోకేష్.. ఇవాళ ఆ పార్టీ ఎంపీల రాజీనామాలపై సెటైర్లు పేల్చారు.
 
''ఏమి నటన.. రాజీనామా డ్రామాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. బీజేపీతో ఒప్పందం చేసుకొని.. తెలివిగా టైంపాస్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామాలతో ఉప ఎన్నికలు నుంచి తప్పించుకున్నారు. వారెవ్వా"అంటూ నారా లోకేష్ సెటైర్లు విసిరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ లాంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు : ఎల్ఐసీ ఛైర్మన్ వీకే శర్మ