ఈ మెుక్కలను ఇంట్లో పెంచుకుంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి, మనీ ప్లాంట్ వంటి మెుక్కలు ఉంటే అదృష్టమని భావిస్తుంటారు. కానీ వేదాలు, చైనా జ్యోతిష్యం ప్రకారం కొన్ని మెుక్కలను మాత్రం ఇంటి ఆవరణలో పెంచితే వాటివలన ప్రతికూలతలు ఎదురవ
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి, మనీ ప్లాంట్ వంటి మెుక్కలు ఉంటే అదృష్టమని భావిస్తుంటారు. కానీ వేదాలు, చైనా జ్యోతిష్యం ప్రకారం కొన్ని మెుక్కలను మాత్రం ఇంటి ఆవరణలో పెంచితే వాటివలన ప్రతికూలతలు ఎదురవుతాయి. వాస్తుకు అనుకూలంగా ఇంటిని ఉంచుకోవడానికి ఈ కింది చిట్కాలను పాటిస్తే మంటిది.
గులాబీ తప్ప బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ముళ్ల జాతి మెుక్కలను ఇంటి ఆవరణలో పెంచకూడదు. వాస్తు ప్రకారం ఎరుపు రంగు పూల మెుక్కలను పెంచుకుంటే మంచిది. తుమ్మ చెట్టును ఇంట్లో పెంచుకుంటే కుటుంబంలో గొడవలు చోటుచేసుకుంటాయి.
చింత చెట్టు, గోరింట మెుక్కలను ఆత్మలు, దెయ్యాలకు నివాసంగా నమ్ముతారు. కాబట్టి ఇలాంటి చెట్లను సాధ్యమైనంత వరకు దూరంగా పెంచుకోవాలి. వాడిపోయిన పువ్వులను ఇంట్లో ఉంచితే దురదృష్టం. ఎండిపోయిన లేదా జీవం కోల్పోయిన మెుక్కలను ఇంట్లో ఉంచరాదు.
తూర్పు, ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయి. పత్తి, తాటిచెట్టులను కూడా ఇంటి ఆవరణలో ఉంటే అశుభమని భావిస్తారు. కుండీల్లో పెంచుతున్న మెుక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కులోని గోడలపై ఉంచరాదు.