సరస్వతి దేవి శక్తి పీఠాలు? భక్తుల పాలిట కల్పవృక్షమై కోరిన వరాలను...

అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్‌లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మతపరమైన దాడులకు గురైనది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మెుదలైంది. దాంతో శ్రీ ఆదిశంకచార్యుల

శుక్రవారం, 6 జులై 2018 (12:52 IST)
అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్‌లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మతపరమైన దాడులకు గురైనది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మెుదలైంది. దాంతో శ్రీ ఆదిశంకచార్యుల వారు అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చారు.
 
ఆ విజ్ఞాన శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేసారు. అప్పటి నుండి కాశ్మీర్‌లోని సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునే వారు శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక్కడి అమ్మవారు భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శుక్రవారం (06-07-2018) దినఫలాలు - వాహన సౌఖ్యం.. పదోన్నతి...