Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాచీన యోగసనాలు వాటి పద్ధతులు.....

అలసట, ఆందోళన, ఒత్తిడి, విసుగు, కోపం, అనారోగ్యాలు వంటికి తగ్గించుకోవడానికి కొన్ని యోగా పద్ధుతులు తెలుసుకుందాం. పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను

Advertiesment
ప్రాచీన యోగసనాలు వాటి పద్ధతులు.....
, మంగళవారం, 26 జూన్ 2018 (12:11 IST)
అలసట, ఆందోళన, ఒత్తిడి, విసుగు, కోపం, అనారోగ్యాలు వంటికి తగ్గించుకోవడానికి కొన్ని యోగా పద్ధుతులు తెలుసుకుందాం. పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసికపరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగా పద్ధతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగా పద్ధతులను కూడా పాటించేవారు. అవేంటో చూద్దాం.
 
ప్రాచీన యోగా పద్ధతులు: 
జ్ఞాన యోగ : జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటం. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. సృష్టి రహస్యం తెలుసుకుని దాని మూల కేంద్రాన్ని చేరుకోవటం.
భక్తియోగ : భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. తమని తాము అర్పించుకోవటం.
కర్మయోగ : ప్రతిఫలాన్ని ఆశించకుండా తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించటమే కర్మయోగాసనం.
మంత్రయోగ : మీకిష్టమైన మంత్రాన్ని లేదా శబ్దం ద్వారా రామ కావచ్చు లేదా ఓం కావచ్చు చేరవలసిన గమ్యాన్ని చేరటం.
యంత్ర యోగ : ఇష్టమైన భగవంతుని విగ్రహరూపాన్ని ప్రతిష్టించుకుని ఆరాధించటం అందులో లీనమవటం.
లయ యోగ : ఇష్టమైన దానిలో ఇమిడిపోవటం, కలిసిపోవటం, అదే లోకంగా జీవించటం.
కుండలిని యోగ : శరీరంలో ఇమిడియున్న తెలియని శక్తిని బైయటకు తీసి దానిద్వారా గమ్యాన్ని చేరడం.
తంత్ర యోగ : మంత్ర తంత్రముల ద్వారా సాధించటం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం....