Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల విజయానికి సూత్రాలు....

మహిళలుగా మీరు ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాలంటే ఇప్పటికే అనేక విజయాలను సాధించిన వ్యక్తుల జీవితాల నుండి మంచి విషయాలను స్వీకరించి వాటి మార్గ నిర్దేశకత్వంలో నడవాలి. అంతేగానీ మీరు విజయం సాధించాలంటే అం

Advertiesment
మహిళల విజయానికి సూత్రాలు....
, సోమవారం, 25 జూన్ 2018 (16:09 IST)
మహిళలుగా మీరు ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాలంటే ఇప్పటికే అనేక విజయాలను సాధించిన వ్యక్తుల జీవితాల నుండి మంచి విషయాలను స్వీకరించి వాటి మార్గ నిర్దేశకత్వంలో నడవాలి. అంతేగానీ మీరు విజయం సాధించాలంటే అందుకు సంబంధించిన సూత్రాలను ఎవరూ అమ్మరు, అమ్మలేరు. ఎందుకంటే అలాంటివి ఉండవు గనుక.
 
విజయ సాధనకు, విజయ శిఖరాగ్రాలను చేరుకున్న అనేకమంది పెద్దల జీవితాల గురించి తీవ్రంగా, చిత్తశుద్ధితో అధ్యయనం చేసి ఓ శాస్త్రీయమైన దృష్టిని అలవర్చుకోవడం అత్యావశ్యకం. అలాంటి పెద్దలనుండి స్వీకరించిన ఏడు ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని విజయానికి శాసనాలు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
మొదటిది - సరైన గమ్యస్థానం
 
జీవితంలో మీకొక లక్ష్యం ప్రయోజనం లేకపోయినట్లయితే పరిస్థితులకు బలి పశువులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సరైన గమ్యస్థానం అనేది చాలా ముఖ్యం. సరైన గమ్యస్థానం అనేది మనలో ఉన్న అభ్యుదయాన్ని ఉదయింపజేస్తుంది. చాలామందిలాగా ఎలాంటి గమ్యస్థానం లేకుండా ఉండకుండా పరిస్థితులపై ఆధిపత్యం సాధించి అదుపులో పెట్టేందుకు ప్రయత్నించాలి. జీవితానికి ఒక ప్రయోజనం ఉన్నట్లయితే అది క్రియాశీల ఆశను ఉత్తేజపరచేదిగా ఉండాలి.
 
రెండవది - విద్య లేక సన్నాహం
 
ప్రయోజనాన్ని సాధించేందుకు అవసరమైన పరిజ్ఞానం విద్య నుంచి వస్తుంది. కాబట్టి తగినంత విజ్ఞానాన్ని సంపాదించుకోవడం మంచిది. విజయం సాధించిన పెద్దలంతా తమ తమ ప్రత్యేక వృత్తుల్లో స్వయంగా విద్యాభ్యాసం పొందినవారే. విద్యాభ్యాసమంటే కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునేదే కాదనీ, వ్యక్తిత్వ అభివృద్ధి, నాయకత్వం, అనుభవం, పరిచయాలు, అనుబంధాల ద్వారా జ్ఞాన సముపార్జన పరిశీలన కూడా కలిసి ఉండాలని వారు గుర్తించారు. దీన్ని మనం మననం చేసుకోవాలి. 
 
మూడవది - మంచి ఆరోగ్యం
 
కంటి నిండా నిద్ర, వ్యాయామం, పుష్కలమైన గాలి, పరిశుభ్రత, సరైన ఆలోచన, అస్వస్థత, వ్యాధి లాంటివి మన శరీర ప్రకృతి ధర్మాలను పాటించడం వలనే వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చెందిన శారీరక చట్టాలు. శారీరక స్థితిపైన మానసిక స్థితి చెప్పుకోదగిన ప్రాబల్యం కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనే మానసిక వైఖరి వలనే విజయం సాధించిన వారిలో చాలామంది నిర్మాణాత్మకంగా ఆలోచిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా చికెన్‌ తయారీ విధానం....