Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమాలు.. ఉడాయ్ చర్యలు

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (13:17 IST)
ఆధార్ నమోదు కేంద్రాల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేదిశగా ఉడాయ్ చర్యలు చేపట్టింది.  వెయ్యికి పైగా ఉన్న ఈసేవ, మీసేవ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను ప్రభుత్వ ప్రాంగణంలోకి మార్చాలని.. తెలుగు రాష్ట్రాల్లోని ఆధార్ నమోదు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు బ్రేక్ వేయాలని అధికారులు కోరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం తప్పనిసరి. అధార్ లేనిదే ఏ పని కావడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం అంత పెద్ద సంఖ్యలో ఈ కేంద్రాలు అవసరం లేదని ఉడాయ్‌ భావిస్తోంది. తగిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మార్పు చేర్పులకు ఏపీలో సుమారు 1700, తెలంగాణలో 2,300 కేంద్రాలతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో స్వయంగా ఉడాయే నమోదు కేంద్రాలను నడుపుతోంది.
 
ఈ నేపథ్యంలో ఆధార్ అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఆధార్‌ కేంద్రాలన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలని ఉడాయ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ ఉడాయ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని మైహోం ప్రాంగణం నుంచి అమీర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ భవనంలోకి మార్చారు. మరోవైపు ప్రైవేటు సంస్థల నుంచి ఆధార్‌ ప్రక్రియను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం