Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది రైల్వే స్టేషన్ కాదు.. నక్షత్ర హోటల్.. తిరుపతి స్టేషన్‌లో లగ్జరీ సౌకర్యాలు

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (14:44 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైల్వే స్టేషన్లలో అరకొరగా సౌకర్యాలు ఉంటాయనీ, కనీసం తాగేందుకు కూడా చుక్కనీరు లభించని ప్రతి ఒక్కరి అభిప్రాయం. అలాంటి రైల్వే స్టేషన్లలో నక్షత్ర హోటల్ సౌకర్యాలు లభిస్తే. లభిస్తేకాదు.. నిజంగాన సమకూర్చారు. అదికూడా ఎక్కడో కాదు. తిరుపతి రైల్వే స్టేషన్. 
 
తిరుపతికి వచ్చి వెంకన్న స్వామిని దర్శనం చేసుకునే ప్రయాణికులకు నిజంగానే ఈ సౌకర్యాలు ఒక వింత అనుభూతిని కల్పిస్తాయి. 'అతిథి' ప్రీమియర్ లాంజ్ పేరుతో తిరుపతి రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ అతిథి లాంజ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. 
 
ఈ విషయంతో పాటు కొన్ని ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదివారం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లాంజ్‌లో సౌకర్యవంతమైన రీక్లయినర్ సీట్లు, లగ్జరీగా ఉండే విశ్రాంతి గదులు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం కూడా ఉంది. కాగా, ఇదే స్టేషన్‌లో త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ కూడా రానుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments