Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:30 IST)
దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతోంది. 
 
ఎలాంటి లోసుగులు.. థర్డ్ పార్టీ హస్తం లేకుండా.. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6000 నగదు వారి అకౌంట్స్‏లో జమకానున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా..ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున అన్నదాతలు పొందుతున్నారు. 
 
ఇప్పటివరకు 8 విడతల వారిగా నగదు వారి ఖాతాల్లోకి జమ అయ్యింది. తాజాగా 9వ విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం  రూ. 9.75 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందాయి. అందులో మీ ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. 
 
రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా మొత్తాన్ని అందుకోకపోతే లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నంబర్లు.. 155261, 011-24300606, 011-23381092. అలా కాకుంటే.. రైతులు తమ ఫిర్యాదులను https://pmkisan.gov.in/Grievance.aspx లో నమోదు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments