Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్ధిరంగా పెట్రోల్ - డీజల్ ధరలు - బైపోల్ ఓటమితో బీజేపీలో వణుకు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (14:41 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే, లీటరు పెట్రోల్ ధర రూ.120ని మించిపోయింది. డీజిల్ ధర కూడా రూ.110ని దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. 
 
దీంతో దీపావళి పండుగ బహుమతి పేరుతో లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, పెట్రోల్‌పై రూ.10 చొప్పున కేంద్రం తగ్గించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెంచింది కొండంత... తగ్గించింది గోరంత అంటూ విపక్ష నేతలు విమర్శలు దిగారు. అదేసమయంలో ఎన్డీయేతర రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గిచేందుకు ససేమిరా అంటున్నాయి. ఇదిలావుంటే, కేంద్ర చమురు సంస్థలు కూడా రోజువారీ వడ్డింపునకు తాత్కాలిక స్వస్తి చెప్పాయి. ఫలితంగా రికార్డు స్థాయిలో ఏడో రోజు కూడా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.46 ఉండగా.. డీజిల్ ధర రూ.94.86గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.
 
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.69లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.90 ఉండగా.. డీజిల్ ధర రూ.95.97గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.65 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.69లకు లభిస్తోంది.
 
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments