దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే, మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రో ధరలు మరోలా ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
అదేవిధంగా విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.77లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 96.05గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.77లకు లభిస్తోంది.