Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్సు చార్జీలు తగ్గించిన ఒడిశా ప్రభుత్వం

Advertiesment
బస్సు చార్జీలు తగ్గించిన ఒడిశా ప్రభుత్వం
, సోమవారం, 8 నవంబరు 2021 (11:58 IST)
ఒడిశా ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బస్సు చార్జీలను తగ్గించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గించాయి. దీంతో ఒడిశా ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు బస్సు ఛార్జీలు తగ్గించారు.
 
ఈ తగ్గింపు 5 పైసల నుంచి 17 పైసలు వరకు ఉంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిలోమీటరుకు 5 పైసలు, ఏసీ, డీలక్స్‌ బస్సులు 10 పైసలు, సూపర్‌ ప్రీమియం ఛార్జీలు 17 పైసలు తగ్గాయి. ఛార్జీల పెంపు, తగ్గింపు అంతా ఇంధన ధరలను బట్టి ఆటోమేటిక్‌ సిస్టం ద్వారా జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మ‌రో పాతికేళ్ళు... 18.37 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్