Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లు

Webdunia
శనివారం, 29 మే 2021 (10:51 IST)
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో ముడి చమురు ఖరీదైన తర్వాత సైతం పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరుగలేదు. అయితే, ముడి చమురు రేట్లు తగ్గిన అనంతరం పెట్రోల్‌, డీజిల్‌పై నాలుగుసార్లు తగ్గించారు. దీంతో పెట్రోల్‌ లీటర్‌కు 77 పైసలు, డీజిల్‌పై 74 పైసలు వరకు తగ్గించాయి. 
 
ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరుసగా, రోజువిడిచి రోజు చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 15 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెంచాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. రూ. 94.43గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు పెరిగింది.
 
ఇకపోతే.. ఒపెక్‌ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్‌ 1న జరుగనుంది. రాబోయే జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. యూఎస్ మార్కెట్లో బ్రెంట్ ముడి శుక్రవారం బ్యారెల్‌కు 69.46 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.53 డాలర్లు తగ్గి.. 66.32 డాలర్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments