Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి ధరలు

Gold Rate
Webdunia
శనివారం, 29 మే 2021 (10:26 IST)
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర శనివారం కూడా దిగొచ్చింది. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్‌గా ఉంటుందనే చెప్పాలి. కానీ వెండి ధర శనివారం పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. దీంతో రేటు రూ.49,860కు క్షీణించింది.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గడం తో రూ.45,700కు దిగి వచ్చింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌‌లో బంగారం ధర పెరిగింది. 0.42 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరింది.
 
ఇక వెండి అయితే రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 28.06 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments