Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం (27-05-2021) రాశిఫలితాలు - కుభేరుడిని ఆరాధించినా...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 27 మే 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు నరాలు, కళ్లు, దంతాలకు సంబంధించిన సమస్య లెదురవుతాయి. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి అధికం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. 
 
వృషభం : ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఉద్యోగ విరమణ చేసినవారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, నిత్యావర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. నోటీసులు, రశీదులు అందుకుంటారు. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల నుంచి ఫలితాలనిస్తాయి. 
 
మిథునం : ప్రముఖులకు అభినందులు తెలియజేస్తారు. విద్యార్థినులు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో మీలో విసుగు, చికాకులు, ఆందోళనచోటు చేసుకుంటాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాజనకం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
కన్య : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ప్రేమికుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. 
 
తుల : ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్లు తప్పవు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. మీ సంతానం భవిష్యత్ బాగుంటుంది. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు.
 
ధనస్సు : ఒకే కాలంలో అనేక పనులు చేపట్టండ వల్ల కాంట్రాక్టర్ల సమస్యలకు లోనవుతారు. మీ బంధువుల పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. వైద్య రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం : స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. దైవకార్యాలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. 
 
కుంభం : మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు తప్పవు. అనుకున్న పనులు కొంత ముందూ వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. ఉద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలే లభిస్తాయి. 
 
మీనం : మిమ్మలను చూసి అసూయపడేవారి పట్ల అప్రమత్తంగా మెలగండి. చేపట్టిన పనులు ఆశించిన రీతిగా సాగవు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సంతానం ఉన్నత విద్యల కోసం కొంత మొత్తం పొదుపు చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి మెట్ల మార్గం మూసివేత.. ఎందుకో తెలుసా?