Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-05-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్య నారాయణ పారాయణ..?

23-05-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్య నారాయణ పారాయణ..?
, ఆదివారం, 23 మే 2021 (11:08 IST)
సూర్య నారాయణ పారాయణ చేసినా ఆరోగ్యం, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
మేషం: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. 
 
వృషభం: వృత్తిపరమైన ప్రయాణాలు సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
మిథునం: ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం: ఏదైనా అమ్మకానికి కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పవు. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ హోదాకు అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలకు నరాలు, వెన్నుముక దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం.
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. సమయస్ఫూర్తిగా వ్యవహరించి మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి వుంటుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల కోసం విహార యాత్రల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. 
 
తుల: నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. ఊహించని ఖర్చులు దుబారా వ్యయం అధికంగా వుంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన అధికమవుతుంది. అందరితో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. ఆల. సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. 
 
ధనస్సు: మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా వుండండి. చేతి వృత్తువ వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది.
 
మకరం: సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా బంధువులు మసలుకుంటారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
కుంభం: బంధుమిత్రుల రాకపోకలతో స్వల్ప ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మీనం: గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సు వ్యాకుల పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. రాజకీయ నాయకులు తమ వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం (22-05-2021) రాశిఫలితాలు - పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు