Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం (21-05-2021) రాశిఫలితాలు - పార్వతిదేవిని పూజించినా...

Advertiesment
శుక్రవారం (21-05-2021) రాశిఫలితాలు - పార్వతిదేవిని పూజించినా...
, శుక్రవారం, 21 మే 2021 (04:00 IST)
మేషం : మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు చికాకు పరుస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేసే కృషిలో ఫలిస్తుంది. గృహ అవసరాలకు ధనం బాగా వెచ్చిస్తారు. మీ మాటతీరు, పద్దతులు ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. 
 
వృషభం : వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఊహంచని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. బాకీలు, ఇంటి అద్దెలు ఇతరాత్రా రావలసిన బకాయిలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులను అతిగా నమ్మొద్దు. 
 
మిథునం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోవడం ఉత్తమం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బిల్లులు చెల్లిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిదికాదు. 
 
కర్కాటకం : ఆర్థికస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు అమలు చేస్తారు. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
సింహం : ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ఆదాయ వ్యయాలు, వ్యాపారాల అభివృద్ధికి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. 
 
కన్య : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలనిస్తాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆసరాగా నిలుస్తారు. పత్రికా సిబ్బందికి ఓర్పు, పునః పరిశీలన ముఖ్యం. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. 
 
తుల : మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. మీ శ్రీమతి, సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. విలాసాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. చేనేత, కళంకారి, ఖాదీ వస్త్రాల విక్రయాలు అధికం. వృత్తుల వారికి పరిచయాలు, పురోభివృద్ధి సాధిస్తారు. ఒత్తిళ్లు, మొహమ్మాటాలు ఇరకాటానికి గురిచేస్తాయి. 
 
వృశ్చికం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు ముగుస్తాయి. దుబారా ఖర్చులు నివారించగలుగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మకరం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీరెదుర్కొన్న సమస్య బంధువులకు ఎదురు కావడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. 
 
కుంభం : రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మీనం : మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవడంతో ఉత్తమం. దూర ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావణుడి తుదిమాట.. ఏదైనా మంచిపని తలపెట్టినప్పుడు..?