Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (18-05-2021) రాశిఫలితాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...

Advertiesment
మంగళవారం (18-05-2021) రాశిఫలితాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...
, మంగళవారం, 18 మే 2021 (04:00 IST)
మేషం : వృత్తుల వారికి అవకాశాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. 
 
వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో పెద్దల సలహాను తీసుకోవడం చాలా ఉత్తమం. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉంటుంది. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. 
 
సింహం : స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. 
 
కన్య : దైవ, దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. 
 
తుల : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆదోళనలకు గురవుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
వృశ్చికం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాలలో చిన్నచిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దలకు మధ్య సమస్యలు ఎదురవుతాయి. 
 
ధనస్సు : విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలు ఆడంబరాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. 
 
మకరం : ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు, మరమ్మతులు వాయిదాపడతాయి. పోగొట్టుకున్న పత్రాలకు నకళ్లు పొందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం మంచిదికాదు. 
 
కుంభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక దానికి వినియోగించాల్సి వస్తుంది. దంపతుల మధ్య సంతానం పై చదువుల ప్రస్తావన వస్తుంది. 
 
మీనం : రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు మూలక ధనం అందుతుంది. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన స్కీములు అమలు చేస్తారు. అందివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు, దైవ దర్శనాలలో చికాకులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?