Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫాఫ్‌ను విడుదల చేసిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (23:14 IST)
నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌(ఎన్‌ఐఎంఎఫ్‌)కు చెందిన ఎస్సెట్‌ మేనేజర్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (నామ్‌ ఇండియా) (గతంలో రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌గా  సుపరిచితం) ఇప్పుడు నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఎఫ్‌ఓఎఫ్‌ (ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ స్కీమ్‌-నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ యొక్క ఈటీఎఫ్‌లు/ఇండెక్స్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెడుతుంది)ను విడుదల చేసినట్లు వెల్లడించింది.
 
నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫాఫ్‌, గణనీయంగా నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన ఈటీఎఫ్‌లు/ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ను నిఫ్టీ 500 టీఆర్‌ఐతో బెంచ్‌మార్క్‌ చేశారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓను 10 డిసెంబర్‌ 2020వ తేదీన తెరిచారు. 24 డిసెంబర్‌ 2020వ తేదీన మూసివేస్తారు. కనీస పెట్టుబడిగా 5 వేల రూపాయలు, ఆ పైన ఒక రూపాయి గుణిజంతో ఎంతైనా పెట్టవచ్చు.
 
లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌... ఇలా మార్కెట్‌లోని విభిన్న విభాగాలు పలు దశలలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాయి. ఏ మార్కెట్‌ ఎప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందనేది ఊహించడం కష్టం. అందువల్ల విభిన్న మార్కెట్‌ల వద్ద పెట్టుబడులు పెట్టడమనేది దీర్ఘకాలంలో భారీ రిటర్న్స్‌ను సృష్టిస్తాయి.
 
నిప్పాన్‌ ఇండియా పాసివ్‌ ఫ్లెక్సిక్యాప్‌ ఫాఫ్‌ విభిన్న మార్కెట్‌ క్యాప్‌లలో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా మార్కెట్‌జ్ఞానంతో పాటుగా పరిశ్రమ జ్ఞానం సైతం ఒడిసిపట్టుకుని  మార్కెట్‌ క్యాప్‌ కేటాయింపుల పరంగా వ్యక్తిగత ఫండ్‌ మేనేజర్ల వివక్షతను తొలగిస్తుంది. ఈ స్కీమ్‌ యొక్క పెట్టుబడి లక్ష్యం దీర్ఘకాలంలో మూలధన వృద్ధి. దీనికోసం నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఈటీఎఫ్‌లు/ఇండెక్స్‌ ఫండ్స్‌ యూనిట్లలో పెట్టుబడులు పెడుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి సౌగత ఛటర్జీ, కో-చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ వినూత్న ఆఫరింగ్‌ను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఓ సంస్థగా మా మదుపరుల కోసం వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహం తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాము. అతి తక్కువ ఖర్చులో పరిశ్రమ మరియు మార్కెట్‌ విజడమ్‌ పరిగణలోకి తీసుకుని మార్కెట్‌లో విభిన్న భాగాలలో  పెట్టుబడులను పెట్టడంలో మదుపరులకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments