Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

'కరోనా వైరస్' డ్రాగన్ కంట్రీ కుట్రే? చైనా చేతిలో కరోనా టీకా? విశ్లేషకులు వాదన!!

Advertiesment
Coronavirus
, సోమవారం, 23 మార్చి 2020 (08:23 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకుంది చైనాలోని వుహాన్ నగరంలో. ఈ వైరస్ దెబ్బకు చైనా గజగజ వణికిపోయింది. 80 వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు. అయితే, వీరిలో చనిపోయిన వారి సంఖ్య సుమారుగా 3500 మందికిపైగా ఉండొచ్చు. కానీ ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 75 వేల వరకువుంది. ఈ లెక్కలే ఇపుడు చైనాను కరోనా దోషిగా చూపిస్తున్నాయి. పైగా, కరోనా వైరస్‌కు ముందుగానే చైనా టీకా కనుగొన్నది అనేది పెక్కు ప్రపంచ దేశాల వాదనగా ఉంది. అందుకే కరోనా వైరస్ బారినుంచి చైనా త్వరగా కోలుకున్నదని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
కరోనా వైరస్ చైనా పని అని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తే.. కాను, అమెరికా పనేనని డ్రాగన్ కంట్రీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ రెండు దోశాల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఈ కరోనా వైరస్ పని ముమ్మాటికీ డ్రాగన్ కంట్రీ పనేనని ఘంటాపథంగా ఆరోపిస్తున్నారు. దీనికి బలమైన కారణాలు కూడా వారు విశ్లేషిస్తున్నారు. 
 
ఆర్థిక మాంద్యం‌లో ఉన్న చైనా తమ దేశంలో ఉన్న విదేశీ పెట్టుబడిదారులను వట్టి చేతులతో పంపించడమే లక్ష్యంగా కరోనా నాటకం ఆడిందన్నది విశ్లేషకుల మాట. ఈ వాదనను అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడూ సమర్థిస్తున్నారు. విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి.. కరోనా కల్లోలానికి ముందు చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమల్లో అమెరికా, యూర్‌పకు చెందినవారి పెట్టుబడులే అధికంగా ఉండేవి. 
 
దీంతో ఆయా కంపెనీల లాభాల్లో సగానికి పైగా వారికే వెళ్లేవి. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగేది. ఈ గ్లోబల్‌ ఎకానమీలో ఎవరినీ తమ దేశం నుంచి వెళ్లగొట్టలేని పరిస్థితి. అందుకే చైనా పొగబెట్టాలనుకుంది. కేవలం వూహాన్‌కే పరిమితమయ్యేలా వైర్‌సను సృష్టించింది. కానీ తాము ఆ వైర్‌సను నియంత్రించలేమని ప్రకటించింది. 
 
ఓ పిశాచంతో యుద్ధం చేస్తున్నామంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలు అక్కడి పారిశ్రామిక రంగంపై అనుమానాలను పెంచాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు వాటాలను అమ్ముకొని చైనా నుంచి బయటకు వచ్చేశారు. ఫలితంగా రెండు రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థలో రూ.1.50 లక్షల కోట్ల సంపద వచ్చి చేరింది. తద్వారా చైనా వైరస్‌ పాచిక పారింది. 
 
అంతేకాకుండా, కరోనా వైర్‌సకు టీకాను చైనా ముందే తయారు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి విశ్లేషకులు చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు, రికవరీ కేసుల సంఖ్యను సాక్షాలుగా చూపిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన చైనాలో ఇప్పటివరకు మొత్తం 81వేలకు పైగా కరోనా కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి. 
 
కానీ, ఇటలీలో మొత్తం 53 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయితే 6,072 కేసులే రికవరీ అయ్యాయి. వైరస్‌ ప్రారంభమైన చైనాలోనే భారీ సంఖ్యలో కేసులు రికవరీ కావడం చూస్తుంటే ఆదేశం ఇప్పటికే టీకాను కనుగొని ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చైనాలో కొత్తగా కేసులు నమోదు కావడం లేదని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలాఖరు వరకూ ప్రజలు ఇళ్ళకే పరిమితం: నీలం సాహ్ని