బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ఫలితంగా భారత ప్రధాన సూచీ బీఎస్ఈ 400 పాయింట్లు భారీగా లాభపడి 37819 వద్ద మొదలైంది.
నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 11100పైన 11131 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి ఆయా కంపెనీలు రూపొందించిన 3 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగించడంతో మార్కెట్ వర్గాలకు ఊతమిచ్చింది. కరోనా వ్యాక్సిన్ సెంటిమెంట్‌తో పాటు.. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ఫలితాలతో అన్ని రంగాలకు చెందిన షేర్ల కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.
ఇకపోతే.. పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీపోర్ట్స్, విప్రో షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. కోల్‌ఇండియా, జీ లిమిటెడ్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫ్రాటెల్, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్ షేర్లు 0.10శాతం నుంచి 1శాతం నష్టాలను చవిచూశాయి.