తమిళనాడును కరోనావైరస్ వణికిస్తోంది. రాష్ట్రంలో నిన్న ప్రకటించిన కరోనావైరస్ పరీక్షల్లో మరో ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కోరనావైరస్ సోకినట్లు తేలింది. దీనితో తమిళనాడులో ఈ వైరస్ బారిన పడిన శాసనసభ్యుల సంఖ్య 17కి పెరిగింది. వీరిలో నలుగురు తమిళనాడు మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తున్నారు.
ఆదివారం నాడు కరోనావైరస్ బారిన పడిన ఎమ్మెల్యేల్లో పి. కార్తికేయన్ - వేలూరు ఎమ్మెల్యే, ఆర్ గాంధీ- రాణిపేట ఎమ్మెల్యే, సెంగోట్టియన్- కృష్ణగిరి ఎమ్మెల్యే వున్నారు. ఈ ముగ్గురు శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో COVID-19 సహాయక చర్యలలో పాల్గొన్నారు.