బర్గర్‌ను ఆర్డర్ చేస్తే.. కెచప్ ప్యాకెట్లు వచ్చాయి.. కారణం తెలిస్తే..?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (22:23 IST)
మెక్ డొనాల్డ్‌లో బర్గర్‌ను ఆర్డర్ చేస్తే.. ఇంటికి రెండు కెచప్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ వాళ్ల తప్పిదం అనుకుంటే మీరు బర్గర్‌లో కాలేసినట్లే. తాగిన మైకంలో సదరు మహిళ ఆర్డర్‌ చేసిన విధానం అర్థంకాక వాళ్లు అలా చేశారట. 
 
ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఈ వార్త పట్ల నెటిజన్లు సదరు మహిళను కామెంట్ల ద్వారా ఆటాడుకుంటున్నారు. తాగిన మైకంలో ఆమె చేసిన బర్గర్.. జస్ట్ కెటప్ ప్యాకెట్లుగా వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టొరంటోకు చెందిన కేటీ పూలే అనే మహిళ తన భర్తతో కలిసి మద్యం సేవించింది. అనంతరం హ్యాంగోవర్‌నుంచి బయటపడేందుకు బర్గర్‌ ఆర్డర్‌ చేసింది. అయితే, ఆర్డర్‌ చేసేటప్పుడు ఉల్లిగడ్డలు.. ఆవాలు.. కూరగాయలు.. బన్ను, ప్యాటీ లేకుండా బర్గర్‌ కావాలని టైప్‌ చేసిందట. 
 
దీంతో మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ సిబ్బంది రెండు కెచప్‌ ప్యాకెట్లను ప్యాక్‌ చేసి ఆమె ఇంటికి డెలివరీ చేశారు. ఆ కెచప్‌ ప్యాకెట్లను చూసి కేటీ పూలేకు తాగింది దిగిపోయిందట. కెచప్‌ ప్యాకెట్ల ఫొటో.. తన భార్య ఆర్డర్‌ మెసేజ్‌ను పూలే భర్త సోషల్‌ మీడియా పెట్టగా వైరల్‌ అవుతోంది. చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన జరిగి చాలా రోజులైనా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments