Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎఫెక్ట్: రెనాల్ట్ నుంచి 15వేల ఉద్యోగాల కోత

Webdunia
శనివారం, 30 మే 2020 (12:32 IST)
Renault
కరోనా వైరస్ నేపథ్యంలో 15వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది ప్రముఖ కార్ల సంస్థ. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. అమ్మకాలు మందగించడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ శుక్రవారం (మే 29,2020) ప్రకటించింది. అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.
 
వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్‌కు చెందిన 4వేల 600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న మూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. 
 
ప్రస్తుత 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టి పెట్టనుంది.
 
మరోవైపు ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది.
 
అలాగే యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ సైతం 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments