బీఎస్-6 కార్లపై మారుతి సుజుకి బంపర్ ఆఫర్

మంగళవారం, 10 మార్చి 2020 (12:17 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా, బీఎస్-4 ప్రమాణాలు కలిగిన కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన కార్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది. ఇక మారుతీ సుజుకీ తన బీఎస్‌-6 కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
 
మారుతీ సుజుకీ సియాజ్‌... 
ఈ కారును కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు రూ.45 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. రూ.10 వేల క్యాష్‌ డిస్కౌంట్‌తోపాటు రూ.25 వేల వరకు బోనస్‌ ఎక్స్‌ఛేంజ్‌, రూ.10 వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇక ఈ కారుకు చెందిన అన్ని వేరియెంట్లపై ఎంపిక చేసిన ఆఫర్లను అందిస్తున్నారు. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే ఈ కారు ప్రారంభ ధర రూ.8.31 లక్షలు కాగా, గరిష్ట ధర రూ.11.09 లక్షలుగా ఉంది. 
 
మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6... 
మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 ఎంపీవీ కారుపై రూ.15 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. ఇందులో 6 సీట్లు ఉంటాయి. 2 గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉంటాయి. రూ.9.84 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 
 
మారుతీ సుజుకీ బలెనో...  
ఈ కారుపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌, రూ.15 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5 వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ కారు రూ.5.70 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉండగా, దీని గరిష్ట ధర రూ.9.03 లక్షలుగా ఉంది. 
 
మారుతీ సుజుకీ ఇగ్నిస్‌...  
ఈ కారుకు చెందిన బీఎస్‌-6 వేరియెంట్‌ 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. భిన్న రకాల వేరియెంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారుకు చెందిన సిగ్మా వేరియెంట్‌పై రూ.20 వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే డెల్టా, జెటా, ఆల్ఫా ట్రిమ్‌ వేరియెంట్లపై రూ.10 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ఇవేకాకుండా రూ.15 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5 వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వైకాపా సర్కారుకు రంగుపడింది... షాకిచ్చిన హైకోర్టు