Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పడాలు అమ్మిన బాలీవుడ్ స్టార్ హీరో... ఎవరు.. ఎందుకు?

Advertiesment
Super 30
, శనివారం, 29 జూన్ 2019 (11:57 IST)
చాలా మంది స్టార్ హీరోలు తమ ఇమేజ్‌తో సంబంధంలేకుండా కొన్ని పనులు చేస్తుంటారు. అలాగే, తాము నటించే చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతుంటారు. అలాంటివారిలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒకరు. ఆయన తన స్టార్ ఇమేజ్‌ను పక్కనబెట్టేసి అప్పడాలు అమ్మారు. అదీ కూడా రోడ్లపై తిరుగుతూ, బస్సు కిటికీల దగ్గర నుంచుని అప్పడాలు అమ్మారు. అయితే హృతిక్ రోషన్ తన నిజజీవితంలో అప్పడాలు అమ్మలేదు లెండి. తాను నటిస్తున్న తాజా చిత్రంలో ఓ సన్నివేశం కోసం ఆయన ఆ పని చేశాడు. 
 
ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం "సూపర్ 30". ఇందులో ప్రధాన పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తున్నారు. ఆనంద్ కుమార్ తన నిజజీవితంలో అప్పడాలు అమ్ముకునే స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ, ప్రపంచంలోనే పేరొందిన గణితశాస్త్రవేత్తగా అవతరించారు. 
 
దీంతో హృతిక్ రోషన్ కూడా ఆ పాత్రకు దగ్గరగా ఉండే సన్నివేశాలకు ప్రాణంపోశాడు. ఇందులోభాగంగా, అప్పడాలు అమ్మే సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కండలు తిరిగిన దేహంతో హీ మ్యాన్‌లా కనిపించే హృతిక్, ఓ బస్టాండ్‌లో బస్సు కిటికీల దగ్గర నుంచుని అప్పడాలు అమ్ముతున్న ఈ స్టిల్ ఆశ్చర్య చకితులను చేస్తోంది. తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టేసి హృతిక్ చేసిన ఈ పాత్ర ఆయన క్రేజ్‌ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 12వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐయామ్ ఆల్‌రైట్... లవ్ యు ఆల్ : స్వీటీ అనుష్క