Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన జెకె టైర్‌, ట్రక్కుల కోసం తెలంగాణాలో 3వ బ్రాండ్‌ షాప్‌ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:19 IST)
భారతీయ టైర్‌ పరిశ్రమ అగ్రగామి- రేడియల్‌ టైర్‌ విభాగంలో సుప్రసిద్ధమైన, జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తమ మూడవ బ్రాండ్‌ షాప్‌ను తెలంగాణాలో ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ షాప్‌ను జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, హెడ్‌- మొబిలిటీ సొల్యూషన్స్‌ అండ్‌ ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ సంజీవ్‌ శర్మ, కంపెనీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ షాప్‌ ప్రారంభంతో జెకె టైర్‌ నెట్‌వర్క్‌ దక్షిణ భారతదేశంలో 32 ఔట్‌లెట్లు కావడంతో పాటుగా దేశంలో వీటి సంఖ్య 77కు చేరింది. తెలంగాణాలో ఈ షాప్‌ ప్రారంభం, దేశవ్యాప్తంగా మరియు తెలంగాణాలో రిటైల్‌ కార్యకలాపాలను విస్తరించాలన్న లక్ష్యంలో భాగం.
 
వ్యూహాత్మకంగా హైదరాబాద్‌-ముంబై హైవే వద్ద దాదాపు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ సదుపాయంలో ట్రక్‌ మరియు బస్సు వినియోగదారులకు సమగ్రమైన సేవలు లభిస్తాయి. ఈ అత్యాధునిక సదుపాయంలో సుశిక్షతులైన టెక్నికల్‌ ఎడ్వైజర్లు, వీల్‌ సర్వీసింగ్‌ ఎక్విప్‌మెంట్‌, పూర్తి శ్రేణి స్మార్ట్‌ టైర్స్‌ ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments