Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టార్టపీడియా 23 వద్ద ఆర్ధిక మందగమన వేళ తీసుకోవాల్సిన చర్యలు: స్పాట్‌ఫ్లోక్‌ సీఈఓ శ్రీధర్‌ శేషాద్రి అభిప్రాయాలు

Seshadri
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (17:53 IST)
‘అంతర్జాతీయంగా మందగమనం వేళ అభివృద్ధి మార్గంలో పయనించేందుకు వ్యూహాలు’ అనే అంశంపై ఓ చర్చా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ) వద్ద జరిగింది. తొమ్మిదివ ఎడిషన్‌ స్టార్టపీడియా 23లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో ‘మదుపరుల అవసరాలను తెలుసుకోవడం’ అనే అంశంపై కూడా చర్చను నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో దేశవ్యాప్తంగా 100కు పైగా నిపుణులు పాల్గొని స్టార్టప్స్‌ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలలో ప్రత్యేకత కలిగిన డీప్‌టెక్‌ టెక్నాలజీ కంపెనీ, స్పాట్‌ఫ్లోక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ, కో-ఫౌండర్‌ శ్రీధర్‌ శేషాద్రి మాట్లాడుతూ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, దీర్ఘకాల బంధాలపై ఆధారపడటం, నగదు ప్రవాహానికి ప్రాధాన్యతనివ్వడం, ఆటోమేషన్‌ వృద్ధి చేయడం, ప్రతిభావంతులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించడమనేది అంతర్జాతీయంగా మందగమన పరిస్థితుల వేళ ఆవశ్యమన్నారు. 
 
మదుపరుల అవసరాలను తెలుసుకోవడం అనే అంశంపై జరిగిన చర్చలో విభిన్నమైన మదుపరులను కనుగొనడం, వారికి స్ఫూర్తి కలిగించిన అంశాలను అర్ధం చేసుకోవడం, మదుపరులు, స్టార్టప్స్‌ నడుమ నమ్మకం పెంచుకోవడం వంటి అంశాలను సైతం చర్చించారు. ఆర్ధిక అంచనాలు, మదుపరుల నిర్ణయాలపై వాటి ప్రభావం గురించి కూడా చర్చించారు.
 
దీనిని అనుసరించి స్టార్టపీడియా 23లో పాల్గొన్న అభ్యర్ధులు, స్టార్టప్స్‌కు మెంటారింగ్‌ కార్యక్రమం కూడా జరిగింది. స్టార్టప్‌ టీమ్స్‌ను మూడు ప్యానెల్స్‌గా విభజించగా, వీటికి శ్రీధర్‌ శేషాద్రి నేతృత్వం వహించారు. అలాగే మరో రెండింటికీ మెంటారింగ్‌ చేశారు. తమ ఆలోచనలు, వ్యాపార నమూనాలను మెరుగుపరచుకోవడం ద్వారా తమ స్టార్టప్‌లను మరో దశకు ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై ఇక్కడ సహాయపడ్డారు.
 
ఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ శ్రీనివాస మూర్తి; సాగవిజన్స్‌ ఇండియా ఫౌండర్‌-సీఓఓ భాను ప్రకాష్‌ రెడ్డి వర్ల; స్టుమ్యాగ్జ్‌ ఫౌండర్‌-సీఈఓ చరణ్‌ లక్కరాజు; హైదరాబాద్‌ ఏంజెల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌-సీఈఓ రత్నాకర్‌ సామవేదం, హైదరాబాద్‌ ఏంజెల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్వతీపురంలో ఘోరం - పెళ్ళికి తిరిగి వస్తూ అనంతలోకాలకు