Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే మూడు నెలల్లో 300 పైగా పాఠశాలలకు విస్తరించాలని చూస్తోన్న యులిప్పు

Advertiesment
sumanth
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (18:59 IST)
భారతదేశపు ప్రప్రధమ బహుముఖ, బహుళ సామర్థ్య ఒటిటి తరహా శిక్షణా వేదిక యులిప్సు. రాబోయే 3 నెలల్లో భారతదేశం అంతటా 300 పైగా పాఠశాలలను కలుపుకోవడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ బ్రాండ్‌ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ వ్యాప్తంగా 200 పైగా పాఠశాలలతో చేయి కలిపింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) సిఫార్సుల ప్రకారం, పాఠశాలలు చదువుతో పాటు సంపూర్ణ నైపుణ్యాభివృద్ధి అభ్యాస వాతావరణాన్ని అందించాలి. ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో శిక్షణా సౌకర్యాలను అందించడం ద్వారా ఈ ప్రయత్నంలో పాఠశాలలకు యులిప్సు సహకారాన్ని అందిస్తుంది. పాఠశాలలకు మూడు ప్రధాన అదనపు విశేషాలను జత చేయడం ద్వారా 1 నుంచి 10వ తరగతి వరకూ పిల్లలకు బహుళ నైపుణ్య అభ్యాస అవకాశాన్ని అందిస్తుంది
 
1. పాఠశాలలు తమ విద్యార్థులందరికీ సాటిలేని అందుబాటు ఖర్చుతో 15+ నైపుణ్యాలను పరిచయం చేయగల వినూత్న అవకాశాన్ని పొందుతాయి. భారతదేశంలో దీనిని పరిచయం చేసిన మొట్టమొదటి ఎడ్‌-టెక్, లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ బ్రాండ్‌ యులిప్సు.
 
2. భధ్రత లేని అశాస్త్రీయ వేదికల వినియోగాన్ని నిర్మూలిస్తూ తమ విద్యార్థులకు సరైన. సురక్షితమైన డిజిటల్‌ సాధనాలను పాఠశాలలు అందించగలవు.
 
3. విద్యార్థులు చిన్నవయస్సులోనే బహుళ నైపుణ్యాలను పొందగలరు, తద్వారా వారు ప్రపంచంలోని మారుతున్న నైపుణ్య ప్రమాణాలకు తగినట్లుగా అవగాహన అందుకుంటూ సిసలైన నిపుణులైన నవతరంగా మారగలరు.
 
ఎన్‌ఇపి సిఫార్సు చేసిన విధంగా యులిప్సు అందించే అన్ని కోర్సులు విద్యార్ధుల సంపూర్ణ అభివృద్ధి, డిజిటల్‌ లెర్నింగ్‌కు అనువుగా రూపొందాయి. సాంకేతికత, ఆకట్టుకునే దృశ్యమాధ్యమంల అనుసంధానించిన విధానం బాలలకు చాలా ఆకర్షణీయంగా నేర్చుకోవడాన్ని సరదాగా మారుస్తుంది. పలు ఆసక్తికరమైన ఫీచర్ల ద్వారా పిల్లలు స్వీయ అభ్యాస కళను నేర్చుకునేలా, తమపై తమకు స్వీయ అంచనా శక్తి వచ్చేలా చేస్తుంది. అవి ఎలాంటివంటే...
 
బహుముఖ థీమ్‌లు: 200+ కోర్సులు 15+ నైపుణ్యాలు (సంగీతం, కళ, హస్తకళలు, యోగా, స్టెమ్‌ ప్రాజెక్ట్‌లు, కోడింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌...మరెన్నో) పిల్లలను వారు కోరుకున్న విధంగా నేర్చుకునేందుకు వీలు కల్పిస్తాయి.
 
గేమిఫైడ్‌ కంటెంట్‌: పిల్లల ఆసక్తిని అందుకోవడానికి దృశ్యపరంగా ఆకర్షణీయమైన సమర్పణ
 
నిపుణుల క్యూరేటెడ్‌ కోర్సులు, మాస్టర్‌-క్లాస్‌లు
 
అసైన్‌మెంట్‌లు/ప్రాజెక్ట్‌లు: అనుభవపూర్వక అభ్యాసాన్ని అందిస్తుంది.
 
డాష్‌బోర్డ్‌లు- లీడర్‌బోర్డ్‌లు: పిల్లల పురోగతిని తెలుసుకుంటుంది.
 
గుర్తింపు: కోర్సులను పూర్తి చేసినందుకు పిల్లలకు అవార్డులు సర్టిఫికేషన్‌లతో గుర్తింపును అందించడం ద్వారా సానుకూలతను సాధించవచ్చు
 
సెల్ఫ్‌-ప్లేస్డ్‌ కంటెంట్‌: కోరుకున్నట్లుగా పాజ్, ప్లే లేదా పునరావృతం చేయడానికి వీలు కల్పించడం
 
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌
 
పేరెంట్‌ వర్క్‌షాప్‌లు
 
టీచర్‌ వర్క్‌షాప్‌లు: శరవేగంగా మార్పు చెందే అభ్యాస వాతావరణంలో మార్పులకు అనుగుణంగా నైపుణ్యం–అప్‌గ్రేడేషన్‌ కోర్సులు
 
తమ వ్యాపార నూతన విస్తరణను ప్రకటించిన సందర్భంగా యులిప్సు వ్యవస్థాపకుడు, సిఇఒ సుమంత్‌ ప్రభు మాట్లాడుతూ, విద్యార్థులను అభ్యాసం దిశగా నిమగ్నం చేయడానికి, వారి అభిరుచులను పెంపొందించడానికి భవిష్యత్తులో వారు విజయవంతం కావడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి యులిప్సు డిజైన్‌ చేయడం జరిగింది. ఈ విజయానికి నిదర్శనం. విద్యా రంగానికి వినూత్నమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో మా అచంచలమైన నిబద్ధత. ఎప్పటికప్పుడు మారుతున్న లెర్నింగ్‌ మార్కెట్‌ దోరణులకు అనుగుణంగా మా వృద్ధి ప్రణాళికలు ఉంటాయి మేం చవి చూసిన సానుకూల ఫలితాలు మేం సరైన మార్గంలో ఉన్నామనేదానికి స్పష్టమైన సూచన. మద్దతు అందించిన అధ్యాపకులు, పాఠశాలలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విద్యా రంగంలో మరింత మంచి మార్పును వీక్షిస్తూ మేం కొనసాగనున్నాం’’ అని అన్నారు. ప్రతి వారం అప్‌లోడ్‌ చేయబడిన కొత్త కోర్సులతో యులిప్సు నిరంతరం వృద్ధి చెందుతోంది. కార్డ్‌ల అంతర్జాతీయ ప్రవేశంతో,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సంస్థ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో  విభిన్నంగా మారుతూ  డిసెంబర్‌ 2023 నాటికి 660+ కోర్సులకు పెరగనుందని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయ్: సీపీఐ