భారతదేశంలో అగ్రగామి వెబ్ 3 సాంకేతిక కంపెనీలలో ఒకటిగా వెలుగొందుతున్న ప్రీమియర్ సంస్థ భారత్ వెబ్ 3 అసోసియేషన్ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ సమాచార, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖతో అవగాహన ఒప్పందం చేసుకుంది. వినూత్నమైన, మొట్టమొదటి తరహా ఎంఓయు, ఈ రెండు సంస్ధల నడుమ సహకారానికి ఓ వేదికను అందించనుంది. వెబ్ 3 సాంకేతిక సంభావ్య ప్రయోజనాలను అన్వేషించేందుకు వినూత్నమైన విధానాన్ని తెలంగాణా ప్రభుత్వం తీసుకోనుంది. ఈ ఒప్పంద ప్రకటనను తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం( ఐ అండ్ సీ) శాఖ మరియు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ అండ్ సీ) శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్; తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి లంకా మరియు కాయిన్ డీసీఎక్స్ చీఫ్ పాలసీ ఆఫీసర్, డైరెక్టర్, భారత్ వెబ్ 3 అసోసియేషన్ కిరణ్ వివేకానంద సమక్షంలో చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, బీడబ్ల్యుఏతో భాగస్వామ్యం చేసుకుంటుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వారికి సాదరంగా స్వాగతం చెబుతున్నాము. బ్లాక్ చైన్ పరిశ్రమ బీడబ్ల్యుఏ అత్యుత్తమ ఉదాహరణగా, ఈ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడానికి నిలుస్తుంది. ఈ ఎంఓయుపై సంతకాలు చేయడమనేది భారతదేశంలో వెబ్ 3 రంగంలో అతి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్ధను సాధించే దిశగా మేము చేస్తోన్న ప్రయత్నాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ భాగస్వామ్యం, స్టార్టప్స్‌కు అసాధారణ విలువను తీసుకురావడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మరియు శక్తివంతమైన రంగంలో అసాధారణ అవకాశాలనూ విస్తరించగలదు అని అన్నారు.
ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి లంకా మాట్లాడుతూ, వెబ్ 3 రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు చక్కటి స్థానంలో తెలంగాణా ఉంది. ఈ వృద్ధికి మేము మద్దతు అందించడానికి కట్టుబడి ఉన్నాము. శాండ్‌బాక్స్, సంబంధిత డాటా, యూజర్లకు అవసరమైన సదుపాయాలను అందిస్తుంది మరీ ముఖ్యంగా వెబ్ 3.0 పర్యావరణ వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే రెగ్యులేటరీ మార్పులపై సిఫార్సులను సూచిస్తుంది.
ఈ భాగస్వామ్యం కింద, భారత్‌వెబ్ 3 భాగస్వామ్యం తెలంగాణా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది. వరుసగా పలు కార్యక్రమాలు, సెమినార్లు, రోడ్ షోలు నిర్వహించడంతో పాటుగా వెబ్3 టెక్నాలజీ పట్ల చర్చనూ లేవనెత్తనుంది. బీడబ్ల్యుఏ ఇప్పుడు తమ సభ్యులు, తెలంగాణా ప్రభుత్వం నడుమ సంభావ్య సినర్జీలను సాధ్యం చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో శాండ్‌బాక్స్ వాతావరణం వినియోగించడం లక్ష్యంగా చేసుకుంది. అంతిమ లక్ష్యం మాత్రం వెబ్ 3 రంగంలో అగ్రగామిగా వెలుగొందాలనే తెలంగాణా ప్రభుత్వ లక్ష్యంకు తోడ్పాటునందించడం.
తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు వెబ్ 3 అందించే అసాధారణ అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రంగంలో అగ్రగామిగా వెలుగొందాలనే రాష్ట్ర లక్ష్యానికి అనుగుణంగా సినర్జీలను అన్వేషించడం బీడబ్ల్యుఏ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ వెబ్ 3 అసోసియేషన్ డైరెక్టర్ మరియు కాయిన్ డీసీఎక్స్ చీఫ్ పాలసీ ఆఫీసర్ కిరణ్ వివేకానంద మాట్లాడుతూ, కాయిన్ డీసీఎక్స్ వద్ద మేము అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం తెంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలకా్ట్రనిక్స్, కమ్యూనికేషన్స్ శాఖతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. తెలంగాణా ప్రభుత్వ దూరదృష్టిని నేను అభినందిస్తున్నాను. వెబ్3 యొక్క ప్రయోజనాలను వారు గుర్తించారు. అంతేకాదు, ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అగ్రగామిగా తమ స్ధానం సుస్థిరం చేసుకుంటున్నారు.
భారత్ వెబ్ 3 అసోసియేషన్ వ్యవస్ధాపక సభ్యునిగా, భారతదేశంలో వెబ్ 3 భవిష్యత్‌కు మార్గం వేస్తుండటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ వ్యవస్థను ప్రోత్సహించడమనేది మా సుదీర్ఘ లక్ష్యంగా ఉంది. తెలంగాణా ప్రభుత్వం మరియు భారత్ వెబ్3 భాగస్వామ్యం దీనిని మరింతగా సాధ్యం చేయనుంది అని అన్నారు. దీనితో పాటుగా, ఐటీఈ అండ్ సీ శాఖతో అందించిన వెబ్ 3 మరియు సంబంధిత సాంకేతికతలలో అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఎంపిక చేసిన కోహోర్ట్‌లకు భారత్ వెబ్ 3 అసోసియేషన్ మెంటార్ చేయడంతో పాటుగా సలహా ఇస్తుంది. ఈ బీడబ్ల్యుఏ ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించింది.