Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (12:10 IST)
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హంగులతో, అధునాతనంగా తీర్చిదిద్దారు. 
 
ఈ స్వర్ణ రైలు పెట్టెలను న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆవిష్కరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కోసం తయారు చేసిన వీటిని తొలుత సియాల్దా - ఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. చూడగానే ఆకట్టుకునేలా పెట్టె లోపలి భాగాలను తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన కాంతి కోసం ఎల్‌ఈడీ దీపాలను వీటిలో అమర్చారు. 
 
మరుగుదొడ్లలో దుర్గంధం రాకుండా ఏర్పాట్లు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాష్‌ బేసిన్లను అమర్చారు. రాత్రిపూట కూడా బెర్తుల సంఖ్యలు సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తలుపుల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మొదటి తరగతి ఏసీ పెట్టెల్లో సులభంగా పైబెర్తులకు చేరుకునేందుకు వీలైన నిచ్చెనలు బిగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments