Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన రైళ్లలో నాణ్యమైన భోజనమట.. నాణ్యత మాత్రమే కడుపు నింపుతుందా ఇండియన్ రైల్వేస్?

మన రైల్వేల్లో విక్రయిస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొనడంతో ఇన్నేళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ మేల్కొంది. రోజూ కోట్లాద

Advertiesment
మన రైళ్లలో నాణ్యమైన భోజనమట.. నాణ్యత మాత్రమే కడుపు నింపుతుందా ఇండియన్ రైల్వేస్?
హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (01:32 IST)
మన రైల్వేల్లో విక్రయిస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొనడంతో ఇన్నేళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ మేల్కొంది. రోజూ కోట్లాదిమంది ప్రయాణీకులను గమ్యానికి తీసుకుపోయే భారతీయ రైల్వే వారికి ప్రయాణసమయంలో సరైన భోజనం పెట్టలేదనే అపప్రథను చిరకాలంగా మూట గట్టుకుని వస్తోంది. రైల్లో భోజనం అంటేనే ఆమడ దూరం పారిపోయే స్థితిని తీసుకువచ్చిన మన రైల్వేలు ఎట్టకేలకు మేల్కొన్నాయి. ఆహార పదార్థాల నాణ్యతను పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. నూతన కేటగరింగ్ విధానంలో భాగంగా నూతన వంటశాలలను ఏర్పాటు చేయనుంది. ఆహార తయారీలో నాణ్యతను పెంచే చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. 
 
రైల్వే స్టేషన్లు, రైళ్ళలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పెంచేందుకు భారతీయ రైల్వే చర్యలను ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ నూతన కేటరింగ్ విధానాన్ని రూపొందించిందని తెలిపింది. నూతన వంటశాలలను ఏర్పాటుచేయాలని, ప్రస్తుతం ఉన్న వంటశాలలను ఆధునికీకరించాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించిందని పేర్కొంది. ఆహార తయారీలో నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో రైల్వేల్లో విక్రయిస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని తెలిపిన సంగతి తెలిసిందే.
 
కానీ నాణ్యత మాత్రమే కాదు. రైల్వే క్యాంటీన్‌లలో అమ్ముతున్న ఆహార పదార్థాల ధరలు చూస్తే కూడా ప్రయాణీకులకు షాక్ కలుగుతోంది. నాసిరకం తిండికి అంత ఖరీదు చెల్లించడం ఇష్టం లేకే ప్రయాణీకులు సొంత ఆహారం తెచ్చుకోవడం పైనే మక్కువ చూపుతున్నారు. రైల్వే శాఖ ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమో..

అయినా ప్రతిసంవత్సరం భారత ఫుడ్ కార్పొరేషన్‌‌ సంస్థలో కోట్లాది రూపాయల విలువైన ఆహార పదార్థాలను ఎలుకలకు ఆహారంగా వేయడానికి బదులుగా వాటితో కోట్లమంది తన ప్రయాణీకులకు కాస్త చౌకధరలతో ఆహార పదార్థాలను అందిసే ఎవరి సొమ్ము పోతుందో మరి. అయినా మన రైల్వే్స్‌లో బాస్మతి రైస్ పండి పెడతారేంటి. బడాయి కాకపోతే..
 
అందుకే ఇండియన్ రైల్వేస్‌కు ఆహార పదార్థాల నాణ్యతను పెంచడమే కాదు.. కాస్త వాటి ధరల విషయంలో కూడా ఆలోచిస్తే మంచిదనీ ప్రయాణీకుల అభిప్రాయం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో 4జీ ఫోన్‌‍ను ఎలా బుక్ చేసుకోవాలంటే...