SBI Home Loan: ఎస్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్‌పై వడ్డీరేట్లు తగ్గింపు

సెల్వి
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (18:29 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహ రుణాలకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇది సమాన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించే కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తుంది. బ్యాంక్ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)లను సవరించింది.
 
ఈ నెల 15 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం రుణగ్రహీతలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25%కి తగ్గించాలనే నిర్ణయం తర్వాత ఈ చర్య తీసుకోవడం జరిగింది. 
 
ఇందులో భాగంగా ఎస్బీఐ రుణ రేట్లను సర్దుబాటు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) లేదా బేస్ రేట్ (బీపీఎల్ఆర్)లో ఎటువంటి మార్పులు ఉండవని బ్యాంక్ ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

తర్వాతి కథనం
Show comments