ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, గోల్డ్ డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి బంగారం ధరలు కెరటం లాగ ఎగురుకుంటూ వచ్చాయి. కానీ బంగారం ధరలు గత వారం రోజులుగా లేనట్టుగా కొంచెం ఊరట కలిగించాయి.
ఫిబ్రవరి నెల మొదలు బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 14వ తేదీన బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము రూ. 10 పెరిగి రూ. 7990గా ఉంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 79900గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.11లు పెరిగి రూ. 8716గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.87160గా ఉంది.
అదే శనివారం బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 15వ తేదీన 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 100లు తగ్గి రూ. 7890 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.78,900గా ఉంది.