దీపావళి తర్వాత పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. తాజాగా నవంబర్ 9న పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది.
ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, వివాహాలు, పండుగల కోసం స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్లు తాజా కొనుగోళ్ల కారణంగా ధరలు పెరిగాయి.
శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు రూ.94,800 ఉంది. నిన్న కిలో ధర రూ.93,800 వద్ద ముగిసింది.