వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంతో ఇటీవల ఏర్పడిన JioStar, ప్రీమియం క్రీడలు, వినోదం, మరెన్నింటిలోనూ అగ్రగామిగా ఉన్న రెండు వేదికలు-JioCinema, Disney+Hotstarను ఒక్కటి చేస్తూ ఇప్పుడు JioHotstarను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్స్ ఒక్కటవడం ద్వారా విస్తృతమైన కంటెంట్, అత్యాధునిక ఫీచర్లు, భారీస్థాయిలో ప్రేక్షకులు, సబ్‌స్క్రైబర్లతో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ పరిశ్రమలో ఒక అపూర్వమైన మైలురాయిగా నిలిచిపోనుంది. సుమారు 3 లక్షల గంటల వినోదం, క్రీడల అసమానమైన లైవ్ కవరేజ్, 50 కోట్లకు పైగా యూజర్లతో వినోదాన్ని పునర్‌నిర్వచిస్తూ ప్రేక్షకులకు అనంతమైన అవకాశాలను అందించేందుకు JioHotstar సిద్ధంగా ఉంది.
JioHotstar ఆవిష్కరణ సందర్భంగా కిరణ్ మణి, సీఈఓ- డిజిటల్ JioStar మాట్లాడుతూ, “ప్రీమియం వినోదం భారతీయులందరికీ అందుబాటులో ఉండాలన్నది JioHotstar ప్రధాన లక్ష్యం. అనంతమైన అవకాశాలను అందించాలన్న మా హామీతో ఇక వినోదమనేది ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. AI ఆధారిత సిఫార్సులను ఏకీకృతం చేస్తూ 19 కంటే ఎక్కువ భాషల్లో స్ట్రీమింగ్ అందిస్తూ కంటెంట్‌ను గతంలో ఎన్నడూ లేని రీతిలో మేము వ్యక్తిగతీకరిస్తున్నాము” అన్నారు.
ప్రీమియం వినోదం అందరికి అందుబాటులో ఉంచాలన్న వాగ్దానం మేరకు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా నచ్చిన షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ చూసేందుకు రావాలని ప్రతీ ఒక్కరినీ JioHotsar ఆహ్వానిస్తోంది. అంతరాయం లేని మెరుగైన అనుభూతి కోరుకునే వైవిధ్యభరిత ప్రేక్షకుల అవసరాల కోసం ప్రారంభ ధర రూ.149/quarterతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను JioHotstar అందిస్తోంది. ప్రస్తుత JioCinema, Disney+Hotstar వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా JioHotstar సబ్‌స్క్రిప్షన్స్‌కు మారవచ్చు.
అద్భుతమైన కంటెంట్ ప్రపంచం
వినోదాన్ని పునర్‌నిర్వచిస్తూ 1.4 బిలియన్ భారతీయులకు 10 భాషల్లో విస్తృతమైన, వైవిధ్యభరితమైన కంటెంట్ అందించేందుకు JioHotstar సిద్ధంగా ఉంది. జోనర్ నిర్వచించే ఒరిజినల్స్ నుంచి అమితంగా ఇష్టపడే రియాల్టీ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, యానిమే, ఇంటర్నేషనల్ ప్రీమియర్ల వరకు ఎంచుకునేందుకు ప్రపంచంలోని విస్తృత టీవీ ప్రోగ్రాములతో ప్రతీ ప్రేక్షకుడికి ఏదో ఒకటి JioHotstar అందిస్తుంది. Disney, NBC Universal, Peacock, Warner Bros. Discovery HBO, Paramount (డిస్నీ, NBC యూనివర్సల్, పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ HBO, పారామౌంట్)- అన్నీ ఒకే వేదికపై JioHotstar అందిస్తుంది. ప్రపంచంలో ఏ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా ఇన్ని అందించడం లేవు.
హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఘనమైన ఎంపికలు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉత్తమ భారతీయ షోలు, సినిమాలు, విస్తృత శ్రేణి క్రీడలు- మీరు ఏం చూడాలనుకున్నా అవి మీకు దొరుకుతాయమని హామీ ఇస్తోంది JioHotstar. అంతే కాదు Sparks అనే వినూత్న వేదిక ద్వారా సృజనాత్మక, ఆకట్టుకునే ఫార్మట్స్‌తో భారతదేశంలో అతి పెద్ద డిజిటల్ క్రియేటర్‌గా ఇది నిలుస్తుంది. “డిజిటల్-ఫస్ట్ వినోదంలో కొత్త బెంచ్ మార్కును JioHotstar నెలకొల్పుతోంది. ప్రేక్షకులు కేంద్రంగా మైమరపింపజేసే, సమ్మళిత వేదికగా ఇది నిలుస్తుంది. అంతులేని వినోదం అందించడంతో పాటు భాషతో సంబంధం లేకుండా ఇష్టపడే కంటెంట్‌ను ప్రతీ భారతీయుడు చూసేందుకు కథ చెప్పే విధానాన్ని నిరంతరం సృజనాత్మకంగా మార్చేందుకు మేము నిరంతరం కట్టుబడి ఉంటాం” అన్నారు కెవిన్ వాజ్, సీఈఓ-ఎంటర్‌టైన్‌మెంట్ JioStar
స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్‌కు తిరుగులేని గమ్యస్థానం
మైమరపింపజేసే ఇంటరాక్టివ్ అనుభూతుల ద్వారా అభిరుచి గలిగిన వారి నుంచి పెద్ద ఈవెంట్స్ తిలకించే ప్రేక్షకులు సహ ప్రతీ అభిమాని క్రీడలను చూసే విధానంలో పరివర్తనను JioHotstar తీసుకువస్తుంది. ICC ఈవెంట్స్, IPL, WPL వంటి ప్రీమియర్ టోర్నమెంట్స్ సహ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌తో క్షేత్రస్థాయి క్రికెట్, BCCI, ICC, రాష్ట్ర సంఘాల కార్యాక్రమాలకు వేదికగా నిలుస్తుంది JioHotstar. క్రికెట్ మాత్రమే కాదు అంతర్జాతీయ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్‌తో పాటు ప్రో కబడ్డీ, ISL వంటి దేశీ లీగ్స్‌ను తీసుకువస్తుంది.
అల్ట్రా-HD 4K స్ట్రీమింగ్, AI-శక్తితో కూడిన ఇన్‌సైట్స్, రియల్-టైమ్ స్టాట్స్ ఓవర్‌లేస్, మల్టీ-యాంగిల్ వ్యూయింగ్, సంస్కృతి, ప్రత్యేక ఆసక్తి ఫీడ్స్‌తో ఉన్నతమైన స్ట్రీమింగ్ అనుభూతి JioHotstarను ప్రత్యేకంగా నిలబెడుతుంది. నచ్చిన ఆటలు మైమరచి చూసేలా అభిమానులకు ఇవి వెసులుబాటు కల్పిస్తాయి. క్రీడల్లో వేదిక తెచ్చిన పరివర్తనను సంజోగ్ గుప్తా, సీఈ- స్పోర్ట్స్, జియోస్టార్ ప్రస్తావిస్తూ, “స్పోర్ట్స్ అనేవి భారతదేశంలో కేవలం ఆటలు మాత్రమే కాదు – లక్షల మందిని ఒక్కటి చేసే ఒక అభిరుచి, ఒక గర్వకారణం. ఉత్తమ టెక్నాలజీ, యాక్సెస్, ఆవిష్కరణను సమ్మిళితం చేయడం ద్వారా అభిమానులు క్రీడలను చూసే అనుభూతిని విప్లవాత్మకంగా మార్చుతోంది JioHotstar. అది ఉర్రూతలూగించే IPL కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ డ్రామా కావచ్చు లేదా ప్రీమియర్ లీగ్ షో మైమరపింపజేసే అనుభూతి కావచ్చు ఇవన్నీ కూడా మీరు స్టేడియంలో చూస్తున్నట్టుగా మైమరపింపజేసే అనుభూతి అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. కోల్డ్‌ప్లే మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ లైవ్‌స్ట్రీమ్‌కు లభించిన అఖండ స్పందనతో ఆ ఆవిష్కరణను క్రీడలకు కూడా విస్తరించి సరికొత్త పుంతలు తొక్కించేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం” అన్నారు.