Duvvada srinivas divvala Madhuri
ప్రేమికుల రోజును పురస్కరించుకుని యువ ప్రేమ జంటలు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రేమను చెప్పడం కోసం రోజా పువ్వులు, గిఫ్టులు ఇచ్చుకుంటారు. వాలంటైన్స్ డేని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏపీలో బాగా పాపులర్ అయిన జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వాలంటైన్స్ డేను జరుపుకున్నారు. వీరి ప్రేమికుల రోజుకు సంబంధించిన వీడియో నెట్టింట డ్రెండింగ్‌లో వుంది.
ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. యువ ప్రేమికుల మాదిరిగా వారిద్దరూ వాలెంటైన్స్ వీక్‌లో రోస్ డేను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్ డేను, వాలెంటెన్స్ డేను జరుపుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసి నవ్వొద్దు.. ఈ రోజు వీళ్ల రోజు కాబట్టి.. ఒక్కరోజు భరించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ స్టూడియో ఇంటర్వ్యూలో వాలెంటెన్స్ డేకి సంబంధించి వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజును స్పెషల్‌గా జరుపుకున్నట్టు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి చెప్పుకున్న ప్రేమ కబుర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.