Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దువ్వాడకు మాధురి ముద్దులు: ఈమెను పరిచయం చేసింది నా భార్యే అంటున్న శ్రీనివాస్

Advertiesment
Madhuri kisses Duvvada

ఐవీఆర్

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (17:37 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. తమ సంబంధం గురించి మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పిన జంటగా గుర్తిండిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రేమికుల రోజు సందర్భంగా మాధురీ శ్రీనివాస్ ఇద్దరూ పలు ఛానళ్లలో సందడి చేసారు. మాధురి అయితే శ్రీనివాస్ బుగ్గలపై లైవ్ లోనే ముద్దులు పెట్టుకుంటూ తన ప్రేమను తెలియజేసింది. అలా దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాలంటైన్స్ డే సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ ప్రేమ పక్షులు ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ జంట చేసిన వీడియో ఒక‌టి ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ల‌వ్ ప్ర‌పోజ్ చేసుకోవ‌డం, ఇంకా ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, ఇచ్చుకున్న కానుకలు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతాయి. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.
 
ఇకపోతే.. మాధురి ఒక డ్యాన్సన్ టీచర్ అని.. మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని దువ్వాడ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని దువ్వాడ చెప్పారు. తన కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై తనకు మాధురి సపర్యలు చేసిందని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్లీల వీడియోలు చూపించి సైకో భర్త టార్చర్.. భార్య సూసైడ్!!