Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనఖా గ్యారెంటీ-ఆధారిత గృహ రుణాలను అందించేందుకు ఐఎంజిసి- జిఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒప్పందం

Advertiesment
Akriti Singh

ఐవీఆర్

, సోమవారం, 13 జనవరి 2025 (21:51 IST)
భారతదేశంలో మొట్టమొదటి తనఖా గ్యారెంటీ సంస్థ అయిన ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజిసి), వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను అందించడానికి ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటైన జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (జిఐసిహెచ్ఎఫ్ఎల్)తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, పెరుగుతున్న హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో అవకాశాలు, స్థోమతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న గృహ రుణ వినియోగదారులకు వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి ఐఎంజిసి చీఫ్ అలయన్స్ ఆఫీసర్ శ్రీమతి అకృతి సింగ్ మాట్లాడుతూ, “వారి క్లయింట్‌లకు వినూత్న తనఖా హామీ పరిష్కారాలను తీసుకురావడానికి జిఐసిహెచ్ఎఫ్ఎల్‌తో భాగస్వామ్యం చేసుకోవటానికి మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ఇంటి యాజమాన్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇటువంటి తనఖా హామీ ఆధారిత ఆవిష్కరణలు రుణదాతకు విలువను పెంచుతాయి. రిస్క్ తగ్గించడంపై దృష్టి పెట్టడంలో, కార్యాచరణ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడతాయి” అని అన్నారు. 
 
ఈ అభివృద్ధిపై జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క ఎండి-సీఈఓ అయిన శ్రీ పాల్ లోబో మాట్లాడుతూ, "మా కస్టమర్లకు వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను అందించడానికి ఐఎంజిసి తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ సహకారం మా ఆఫర్‌ల శ్రేణిని విస్తరించడానికి మాత్రమే కాకుండా, మధ్య మరియు అల్పాదాయ  గృహయజమానులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కూడా వీలు కల్పిస్తుంది" అని అన్నారు. జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అచ్యుత మూర్తి సోంభట్ల మాట్లాడుతూ, "భారతదేశం అంతటా అనేక మంది ఆశావహ గృహయజమానులు తమ కలలను సాకారం చేసుకోవటంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నాము"అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ కోసం సామ్‌సంగ్ ముందస్తు రిజర్వేషన్ ప్రారంభం