Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:35 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు జూన్ నుంచి పెరగడం ప్రారంభించాయి. అయితే సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది. నిజానికి బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.
 
ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్‌ల బంగారం ధర రూ.47,110 (ఆదివారం రూ.47,100), 24 క్యారెట్ల గోల్డ్ రూ.51,260 (ఆదివారం రూ.51,250)గా ఉంది. 
 
అలాగే, దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌ైలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.48,310 (ఆదివారం రూ.48,300), 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,310 (ఆదివారం రూ.49,300గా వుంది. 
 
ఇకపోతే, త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.46,160 (ఆదివారం రూ.46,150)గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,360 (ఆదివారం రూ.50,350)గా వుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.45,910 (ఆదివారం రూ.45,900), 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,080 (ఆదివారం రూ.50,070)గాను, విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.45,910 (ఆదివారం రూ.45,900, 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,080 (ఆదివారం రూ.50,070గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments