జనవరి నెలలో రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:45 IST)
దేశ ప్రజలకు బంగారంపై మక్కువ మరింతగా పెరిగిపోతుంది. ఒకవైపు బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నప్పటికీ వీటి కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిల్లో విదేశాల నుంచి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ఈ యేడాది మొదటి నెల అయిన జనవరి నెలలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గత యేడాదితో పోల్చితే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ యేడాదిలో బంగారం ధరలు ఏకంగా 11 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. 
 
గత యేడాది జనవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇపుడది 2.68 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత యేడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, కొత్త యేడాదిలో పసిడి ధర 11 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88200గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments