Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

Advertiesment
diamond necklace

ఠాగూర్

, సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (08:32 IST)
ఢిల్లీ విమానాశ్రయంలో వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెక్లెస్‌ను ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ నెక్లెస్ విలువ రూ.6 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తమ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 
 
ఈ నెల 12వ తేదీన బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతను అత్యంత ఖరీదైన ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వజ్రాలు పొదిగిన 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ సుమారు రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..