Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో రైళ్లకు డ్రైవర్లు అవసరం లేదు.. ఎలాగంటే?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (12:50 IST)
భవిష్యత్‌లో రైళ్లకు లోకో పైలట్‌లు అవసరం ఉండదు. సెల్ప్ డ్రైవ్ రైళ్లు వస్తున్నాయి. తాజాగా జర్మనీలో హంబర్గ్‌ నగరంలో ఆటోమెటెడ్ రైలును నడిపారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా లోకో పైలట్‌ నడిచిన రైలు.
 
జర్మనీలోని రైల్వే సంస్థ అయిన డాయ్‌చు బాన్‌, సీమన్స్‌ సంస్థలు కలిసి ఈ ఆటోమెటెడ్‌ రైలును తయారు చేశాయి. ఈ రైలు సాధారణ రైళ్లతో పోలిస్తే సమయం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
అలాగే 30 శాతం ఎక్కువ ప్రయాణికులను రవాణా చేయగలదని, 30 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆటోమెటెడ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
 
అయితే మొదటిసారిగా నాలుగు డ్రైవర్‌ ఆటోమెటెడ్‌ రైళ్లుగాను తయారు చేశారు.రైలు పర్యవేక్షణ కోసం ఒక డ్రైవర్‌ను ఉంచుతామని రైలు కంపెనీ అధికారులు తెలిపారు.
 
డాయ్‌చు బాన్‌ సీఈవో రిచర్డ్‌ లూట్జ్‌ మాట్లాడుతూ.. మేం కొత్త ట్రాక్ వేయకుండానే సమయపాలనలో నికచ్చిగల రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రైవర్ లెస్‌ రైళ్లు రవాణాను మరింత మరింత తెలివిగా చేస్తున్నాయని సీమన్స్‌ సీఈవో రోలాండ్‌ బుష్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments