భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీసీబీ, జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఎవర్‌ఫ్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంలో మద్దతును అందిస్తూ అందజేసింది. ఈ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను జాయింట్ కలెక్టర్ ఏఎస్ ఉదయకుమార్; సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు; మంగళగిరి తాహసీల్దార్ జి. రామప్రసాద్ మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏ.వి పటేల్‌కు అందజేశారు.
ఈ తోడ్పాటును హెచ్‌సీసీబీ (హిందుస్తాన్ కోకా కోలా బేవరేజస్) యొక్క దేశవ్యాప్త కోవిడ్ కేర్ ప్లాన్‌లో భాగంగా అందజేశారు. ఈ కోవిడ్ కేర్ ప్లాన్‌లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఉచితంగా ఆహార పొట్లాలు, శీతల పానీయాలను అవసరార్థులకు పంపిణీ చేయడం, ఐసీయు, ఇతర అత్యవసర వైద్య యంత్ర సామాగ్రిని ప్రభుత్వ, చారిటబుల్ ఆస్పత్రులకు విరాళంగా అందించడంతో పాటుగా టీకా శిబిరాలు, మద్దతుకార్యక్రమాలకు తోడ్పాటునందించడం చేయనున్నారు. దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను హెచ్‌సీసీబీ పంపిణీ చేసింది. తద్వారా తగినంత ఆక్సిజన్ సరఫరా లేక సతమతవుతున్న కమ్యూనిటీకి తోడ్పాటునందిస్తుంది.
హెచ్‌సీసీబీ అందించిన తోడ్పాటును జిల్లా యంత్రాంగం ప్రశంసించడంతో పాటుగా భవిష్యత్‌లో కూడా ఇదేవిధమైన తోడ్పాటును అందుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కష్టకాలంలో సమాజానికి తోడ్పాటునందించేందుకు ముందుకు వచ్చిన హెచ్‌సీసీబీ బృందానికి వారు ధన్యవాదములు తెలిపారు.
సమాజ సంక్షేమానికి తోడ్పాటునందించేందుకు కంపెనీ నిబద్ధతను పునరుద్ఘాటించిన హెచ్‌సీసీబీ చీఫ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కమలేష్ శర్మ మాట్లాడుతూ, తీవ్ర ఆరోగ్య సంక్షోభంతో దేశం పోరాడుతున్న వేళ సమాజానికి తోడ్పాటునందించేందుకు తగిన అవకాశం తమకు దక్కడం ఓ అదృష్టంగా భావిస్తున్నాం. మునిచ్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి మేము ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. జర్మనీ నుంచి ఈ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను సమీకరించుకునేందుకు వారు ఎంతగానో తోడ్పడ్డారు.
నెమ్మదిగానే అయినా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రం తగిన చర్యలు తీసుకోవడంలో చక్కటి పురోగతి చూపుతుంది. ఈ కారణం చేత వీలైనంత ఎక్కువ మందికి టీకాలను అందించడంపై తాము దృష్టి కేంద్రీకరించాం. అందువల్ల ఓ చేత్తో తాము జిల్లా యంత్రాంగం మద్దతుతో మా ఫ్యాక్టరీ ఉద్యోగులు మరియు సేల్స్ సిబ్బందికి టీకాలను అందించడంతో పాటుగా మరో చేత్తో జిల్లా యంత్రాగానికి ప్రభావవంతంగా, సమర్థవంతంగా గుంటూరు జిల్లాలో భారీ స్థాయిలో టీకా కార్యక్రమాలను నిర్వహించేలా మద్దతునందించనున్నాం అని అన్నారు.
ఈ పేర్కొనబడిన ప్రణాళికలతో పాటుగా హెచ్‌సీసీబీ ఇప్పుడు వెంటిలేటర్లను, ఐసీయు బెడ్స్, ఐసీయు యంత్రసామాగ్రి, బై పాప్ మెషీన్లు మరియు పలు ఇతర వైద్య అత్యవసర సదుపాయాలను ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులకు అందించనున్నాం. వీటితో పాటుగా, హెచ్‌సీసీబీ ఇప్పుడు డ్రై రేషన్ కిట్స్‌ను నిరుపేదలకు అందించడం ఆరంభించింది. టీకా కేంద్రాల వద్ద శీతల పానీయాలను పంపిణీ చేయడమూ ప్రారంభించింది.
వీటితో పాటుగా మండుటెండలు, ఉక్కబోత వాతావరణంలో కూడా సమాజానికి తమ సేవలనందిస్తున్న నర్సులు, హెల్త్‌కేర్ వర్కర్లు, పోలీస్, అంబులెన్స్ సిబ్బంది, ఆశా వర్కర్లు మొదలైన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వీటిని సరఫరా చేస్తుంది. అదనంగా, అభ్యర్థనల మీదట జార్జియాటీ, కాఫీ మెషీన్లను కొన్ని ఆస్పత్రులలో కోవిడ్ కేర్ వార్డులలో మరీ ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది కోసం అమర్చడం జరుగుతుంది.