Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహంతి నరేంద్ర గిరి ఆత్మహత్య.. నిందితులకు లై డిటెక్టర్ పరీక్ష

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:37 IST)
ప్రయాగ్‌రాజ్‌లోని మఠంలో మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించాలని సీబీఐ ప్రయాగ్‌రాజ్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు పెట్టుకుంది. 
 
మహంతి నరేంద్ర గిరి మృతి కేసులో ఆనంద గిరి, ఆద్య తివారి, సందీప్ తివారీలపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ ముగ్గురికీ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. మంగళవారం రోజున మెజిస్ట్రేట్ ముందు సీబీఐ దరఖాస్తు పెట్టింది.
 
అక్టోబర్ 18న సీజేఎం కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. నిందితులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకానున్నారు. అఖిల భారతీయ అఖాడా పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా నిందితులు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ప్రయాగ్‌రాజ్‌లోని భాగంబరి మఠంలో సెప్టెంబర్ 20వ తేదీన ఉరి వేసుకుని నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముగ్గురు తనను మానసికంగా వేధించినట్లు మహంతి నరేంద్ర గిరి తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. ఐపీసీలోని 306 సెక్షన్ ప్రకారం ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments