Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘హర్‌బెడ్‌ డోజీ బెడ్‌’ లక్ష్యం సాకారం చేసేందుకు 6 మిలియన్‌ డాలర్లను సమీకరించిన డోజీ

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (22:50 IST)
భారతదేశపు మొట్టమొదటి కాంటాక్ట్‌లెస్‌ రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌ (ఆర్‌పీఎం), ఏఐ ఆధారిత ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ (ఈడబ్ల్యుఎస్‌), డోజీ ఆరు మిలియన్‌ డాలర్లను తమ సిరీస్‌ ఏ2 ఫండింగ్‌లో భాగంగా సమీకరించింది. ఈ రౌండ్‌లో డోజీ యొక్క ప్రస్తుత మదుపరులు సైతం నిధులను అందించారు. వీరిలో ప్రైమ్‌ వెంచర్‌ పార్టనర్స్‌, 3ఒన్‌4 క్యాపిటల్‌, యువర్‌నెస్ట్‌ వీసీ, నూతన మదుపరులలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జె అండ్‌ ఏ పార్టనర్స్‌ ఫ్యామిలీ ఆఫీస్‌- దినేష్‌ మోడీ వెంచర్స్‌ (మాజీ జెబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రొమోటర్స్‌- షరాన్‌ అషర్‌ మరియు ప్రణబ్‌ మోడీ) ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 50కు పైగా జిల్లాల్లో 380కు పైగా హాస్పిటల్స్‌లో డోజీ సేవలను అందిస్తుంది. దీని కీలకమైన మైలురాళ్లలో యుఎస్‌ ఎఫ్‌డీఏ 510 (కె) క్లియరెన్స్‌ను ప్రతిష్టాత్మక రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌ ప్రొడక్ట్‌- డోజీ కాంటాక్ట్‌లెస్‌ వైటల్‌ సైన్స్‌ (వీఎస్‌) మెజర్‌మెంట్‌ సిస్టమ్‌ కోసం పొందింది. అంతేకాకుండా, మేడ్‌ ఇన్‌ ఇండియాకు తమ నిబద్ధతను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శిస్తుంది. వైద్య ఉపకరణాలు, అల్గారిథమ్స్‌కు అంతర్జాతీయ ప్రమాణం యుఎస్‌ ఎఫ్‌డీఏ.
 
మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఫర్‌ ద వరల్డ్‌ అనే తమ లక్ష్య సాకారంలో భాగంగా-డోజీ యొక్క వినూత్నమైన సాంకేతికత, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అంతరాలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో తమ కాంటాక్ట్‌లెస్‌ రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌(ఆర్‌పీఎం), ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌(ఈడబ్ల్యుఎస్‌) ద్వారా పూరిస్తుంది. ఈ తాజా ఫండింగ్‌తో, డోజీ మరింతగా భారతీయ మార్కెట్‌లో విస్తరించడంతో పాటుగా తమ వైవిధ్యీకరించిన ఆర్‌ అండ్‌ డీ సామర్ధ్యాలలో పెట్టుబడులు పెడుతుంది. అదనంగా,  ఈ ఫండింగ్‌ కంపెనీ యొక్క అంతర్జాతీయ విస్తరణకు సైతం తోడ్పడనుంది.
 
‘‘రాబోయే రెండు సంవత్సరాలలో 100కు పైగా జిల్లాల్లో 2వేల హాస్పిటల్స్‌ను చేరుకోవడం ద్వారా భారతదేశంలో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలను వృద్ధి చేయాలని డోజీ ప్రణాళిక చేసింది. ప్రస్తుత సిరీస్‌ ఏ2 ఫండ్‌ సమీకరణ, కంపెనీ ప్రణాళికలో భాగం. తద్వారా దేశంలో ప్రతి మూలనూ చేరుకోవడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్‌లో మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తుల యుగం ప్రారంభమవుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా, డోజీ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. కానీ మా వృద్ధి ప్రయాణం కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. మా వృద్ధి వేగం మా లక్ష్యం దిశగా మా వృద్ధిని వేగవంతం చేయడంతో పాటుగా భారతీయ హెల్త్‌కేర్‌ మౌలిక సదుపాయాల భవిష్యత్‌ను హర్‌ బెడ్‌ డోజీ బెడ్‌ చేయడంలో తోడ్పడుతుంది’’ అని డోజీ సీఈఓ- కో ఫౌండర్‌ శ్రీ ముదిత్‌ దండ్వాతీ అన్నారు.
 
హెల్త్‌కేర్‌ వర్కర్లు రిమోట్‌గా రోగులను పర్యవేక్షించడంలో డోజీ సహాయపడుతుంది. ఇది అత్యంత కీలకమైన అంశాలైనటువంటి హార్ట్‌రేట్‌, రెస్పిరేషన్‌ రేట్‌, బ్లడ్‌ ప్రెజర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్ధాయిలు తెలుసుకోవడం, ఉష్ణోగ్రత, ఈసీజీ తీయడం చేస్తుంది. డోజీ యొక్క ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌(ఈడబ్ల్యుఎస్‌) ఈ వైటల్‌ పారామీటర్ల ధోరణులను పరిశీలించడంతో పాటుగా హెల్త్‌కేర్‌ ప్రదాతలను అప్రమత్తం చేస్తుంది. రోగుల ఆరోగ్యం క్లీనికల్‌గా క్షీణిస్తుండటం తెలపడంతో పాటుగా సమయానికి తగిన వైద్య జోక్యం చేసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. స్వతంత్య్ర కన్సల్టింగ్‌ సంస్థ సత్త్వా నిర్వహించిన అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం ప్రతి 100 డోజీ కనెక్టడ్‌ బెడ్స్‌కూ ఇది 144 మంది ప్రాణాలను కాపాడింది. నర్సులు ఈ వైటల్స్‌ తీసుకోవడం పరంగా 80% సమయం ఆదా చేయడంతో పాటుగా ఐసీయు ఏఎల్‌ఓఎస్‌ను 1.3 రోజులకు తగ్గించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments