Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖపట్నంలో తమ రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించిన అల్టిగ్రీన్‌

image
, సోమవారం, 3 ఏప్రియల్ 2023 (21:22 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ వాణిజ్య విద్యుత్‌ వాహన తయారీదారు అల్టిగ్రీన్‌ ఇటీవలనే తమ పూర్తి సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని విశాఖపట్నంలో ప్రారంభించింది. భారతదేశంలో కంపెనీకి ఇది 30వ డీలర్‌షిప్‌. అంతకు ముందు ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులలో సంస్థ తమ కేంద్రాలను ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఈ నూతన ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం నగరంలోని ఈవీ ప్రియులకు అల్టిగ్రీన్‌ యొక్క విస్తృత శ్రేణి కార్గో వాహనాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం అందిస్తుంది. భాగస్వామ్య పరంగా, దక్షిణ భారతదేశంలో విఖ్యాత ఆటోమొబైల్‌ డీలర్‌షిప్‌లలో ఒకటైన లక్ష్మి గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకుంది. అల్టిగ్రీన్‌ రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రశాంత్‌ శంకేశ్వర్‌, నేషనల్‌ హెడ్‌-నెట్‌వర్క్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చార్జింగ్‌ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్‌-అల్టిగ్రీన్‌ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ప్రశాంత్‌ శంకేశ్వర్‌, నేషనల్‌ హెడ్‌-నెట్‌వర్క్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చార్జింగ్‌ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్‌-అల్టిగ్రీన్‌ మాట్లాడుతూ, ‘‘మేడ్‌ ఇన్‌ ఇండియా కంపెనీగా, పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చనుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మరీ ముఖ్యంగా సస్టెయినబల్‌ లాస్ట్‌మైల్‌ మొబిలిటీ దిశగా వాణిజ్య వాహనాల అవసరాలను తీర్చనున్నాము. విశాఖపట్నంలో లక్ష్మి గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. బహుళ వాహన విభాగాలలో ప్రపంచశ్రేణి ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అన్నారు.
 
ఈ  సందర్భంగా శ్రీ శ్రీకాంత్‌ ఎర్రబల్లి, మేనేజింగ్‌ డైరెక్టర్‌-లక్ష్మి గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘అల్టిగ్రీన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఈవీ విప్లవం తీసుకురానున్నాము. ఓ గ్రూప్‌గా, ప్రాంతీయంగా బలమైన పోటీతత్త్వాన్ని కలిగి ఉండటానికి ఆవిష్కరణల మాధ్యమం వినియోగించడం ద్వారా రిటైల్‌, డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదగడానికి కృషి చేస్తున్నాము. విశ్వసనీయ బ్రాండ్లు, ఉత్పత్తులతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని మేము  నమ్ముతున్నాము. దీనిద్వారా నేటి వినియోగదారుల అవసరాలను తీర్చగలము. అల్టిగ్రీన్‌తో భాగస్వామ్యంతో, మా లక్ష్యంలో ఓ సమర్ధవంతమైన భాగస్వామితో చేతులు కలిపామని సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యంతో సస్టెయినబుల్‌ లివింగ్‌కు ప్రచారం చేయడంతో పాటుగా విద్యుత్‌ మొబిలిటీకి అతి సులభంగా మారడమూ సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాండూరులో టెన్త్ ప్రశ్నా పరీక్షా పత్రం.. వాట్సాప్ ప్రత్యక్షం