అనుకుంటే ఎంతసేపు.. తాడేపల్లి ప్యాలెస్‌ను కూల్చడానికి ఒక్క నిమిషం చాలు..!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (21:35 IST)
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లేదా అంతకంటే ముందుగా ఎన్నికలు జరిగినా విజయం తెలుగుదేశం పార్టీకేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ నేతలతో సమావేశమయ్యారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని, వారిపై తప్పుడు కేసులు పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ఒక్క నిమిషంలోపే కూల్చివేయవచ్చని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి చేదు గుణపాఠమని పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాల నుంచి టీడీపీని తరిమికొట్టాలన్న సీఎం జగన్ ప్లాన్ కేవలం కల మాత్రమేనని, అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని టీడీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments